Breaking News

11 ఓటములు.. విసిగి పోయిన హెడ్ కోచ్‌! ఏమి చేశాడంటే?

Published on Tue, 10/21/2025 - 11:55

ప్రోక‌బ‌డ్డీ లీగ్‌-2025 సీజ‌న్‌లో యూపీ యోధాస్ పేలవ ప్ర‌ద‌ర్శన కొనసాగుతోంది. గత సీజన్‌లో గ్రూపు స్టేజికే పరిమితమైన యూపీ జట్టు.. ఇప్పుడు కూడా అదే తీరును కనబరుస్తోంది. ఇప్పటివరకు 17 మ్యాచ్‌లు ఆడిన యోధాస్ కేవలం ఆరింట మాత్రం విజయం సాధించి.. మిగితా 11 మ్యాచ్‌లలో ఓటములను చవిచూసింది. పర్దీప్ నర్వాల్, సురేందర్ గిల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికి యూపీ యోధాస్ గెలుపు బాట పట్టడం లేదు. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో యూపీ జ‌ట్టు 11వ స్దానంలో కొన‌సాగుతోంది.

2017 నుండి 2023 వరకు ప్రతి సీజన్‌లో ప్లేఆఫ్‌లకు చేరిన తమ ఆరాధ్య జట్టు.. ఇప్పుడు ఈ తరహా ప్రదర్శన చేయడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఆ జట్టు హెడ్ కోచ్  జస్వీర్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. యూపీ యోధాస్ ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాన కోచ్ పదవి నుంచి జస్వీర్ సింగ్ తప్పుకొన్నాడు. జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో యూపీ ఘోర పరాజయం పాలైన తర్వాత జస్వీర్ తన మనసులో మాటను వెల్లడించాడు. సీజన్ 5 నుండి యోధాస్ కోచింగ్ సెటప్‌లో అంతర్భాగంగా ఉన్న జస్వీర్ సింగ్.. తన షాకింగ్ నిర్ణయంతో అందరిని ఆశ్చర్యపరిచాడు.

రైడర్స్ అట్టర్ ప్లాప్‌..
ఈ సీజన్‌లో యూపీ యోధాస్ రైడర్స్ అట్టర్ ప్లాప్ అయ్యారు. పర్దీప్ నర్వాల్ వంటి స్టార్ రైడర్ సైతం పాయింట్లు తీసుకురావడం‍లో విఫలమయ్యాడు. మొత్తం యూపీ యోధాస్ ఇప్పటివరకు 718 రైడ్స్‌కు వెళ్లగా.. కేవలం 347 రైడ్ పాయింట్లు మాత్రమే సాధించింది. అందులో టచ్ పాయింట్స్ 229 కాగా.. బోనస్ పాయింట్స్ 118గా ఉన్నాయి. రైడ్ విజయ శాతం 38 % గా ఉంది. అటు డిఫెండ‌ర్స్ టాకిల్ విజయ శాతం 36%గా ఉంది.
చదవండి: IND vs AUS: 244 ప‌రుగులు.. 83.84 స్ట్రైక్ రేటు! అడిలైడ్‌లో అద‌ర‌గొట్టిన విరాట్ కోహ్లి
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)