వన్డే వరల్డ్‌కప్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్‌

Published on Thu, 09/04/2025 - 21:25

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2025కు ముందు భారత జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్‌, వికెట్ కీపర్ బ్యాటర్ యస్తికా భాటియా మెకాలి గాయం కారణంగా టోర్నమెంట్ నుండి వైదొలిగింది. ఈ విషయాన్ని బీసీసీఐ ధ్రువీకరించింది.

ఆమె స్ధానాన్ని ఉమా చెత్రితో భారత క్రికెట్ బోర్డు భర్తీ చేసింది. కాగా ఈ మెగా టోర్నీ కోసం హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు వైజాగ్‌లో ప్రాక్టీస్ క్యాప్‌ను నిర్వహించింది. ఈ సన్నాహకాల్లో భాగంగానే భాటియా గాయపడింది. ఈ క్రమంలోనే వరల్డ్‌కప్‌తో పాటు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కూడా యస్తికా దూరమైంది.

"వైజాగ్‌లో జరిగిన టీమిండియా సన్నాహక శిబిరంలో యాస్తికా భాటియా ఎడమ మోకాలికి గాయమైంది. దీంతో ప్రపంచకప్‌కు యస్తికా దూరమైంది. ప్రస్తుతం ఆమె బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉంది. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. 

అయితే యాస్తికా గత కొన్ని సిరీస్‌ల నుంచి జట్టుతో ఉన్నప్పటికి ప్లేయింగ్‌ ఎలెవన్‌లో మాత్రం రెగ్యూలర్‌గా చోటు దక్కించుకోవడం లేదు. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌కు ప్రత్యామ్నాయంగా కొనసాగుతోంది. ఇప్పుడు రిచాకు బ్యాకప్‌గా అస్సాంకు చెందిన ఉమా జట్టుతో చేరనుంది. ఉమా చెత్రి ఇప్పటివరకు భారత తరపున వన్డేల్లో అరంగేట్రం చేయలేదు. కాగా ఈ మెగా ఈవెంట్‌ సెప్టెంబర్‌ 30 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో గౌహతి వేదికగా భారత్‌-శ్రీలంక జట్లు తలపడనున్నాయి.

ఆస్ట్రేలియాతో వన్డేలకు భారత జట్టు(అప్‌డేటడ్‌): హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్‌), క్రాంతి గౌడ్, సయాలీ సత్‌ఘరే, రాధా యాదవ్, శ్రీ చరణి, స్నేహ రాణా, ఉమా చెత్రీ (వికెట్ కీపర్‌)

మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025కు భారత జట్టు (అప్‌డేటడ్‌): హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, స్నేహ రాణా, ఉమా చెత్రీ
 

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)