Breaking News

ఊచ‌కోత‌.. ఒకే ఇన్నింగ్స్‌లో 426 పరుగులు! 46 ఫోర్లు, 8 సిక్స్‌ల‌తో

Published on Sun, 11/10/2024 - 11:14

కల్నల్ సికె నాయుడు ట్రోఫీ-2024లో హర్యానా ఓపెనర్ యశ్వర్ధన్ దలాల్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీలో భాగంగా గుర్‌గ్రామ్ వేదిక‌గా ముంబైతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో యశ్వర్ధన్ ఏకంగా క్వాడ్రపుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో ముంబై బౌల‌ర్ల‌ను యశ్వర్ధన్ ఊచ‌కోత కోశాడు. 

వ‌న్డే త‌ర‌హాలో ఈ హర్యానా బ్యాటర్‌ విరుచుకుపడ్డాడు. ఓవరాల్‌గా 463 బంతులు ఎదుర్కొన్న యశ్వర్ధన్ దలాల్ 46 ఫోర్లు, 12 సిక్స్‌ల‌తో 426 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఓపెనర్‌ అర్ష్ రంగతో కలిసి యశ్వర్ధన్  410 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

అర్ష్ రంగ(151) కూడా సెంచరీతో మెరిశాడు. వీరిద్దరి విధ్వంసం ఫలితంగా హర్యానా తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 748 పరుగుల భారీ స్కోరును సాధించింది.

తొలి ప్లేయర్‌గా..
ఇక ఈ మ్యాచ్‌లో క్వాడ్రపుల్ సెంచరీతో మెరిసిన యశ్వర్ధన్ పలు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కల్నల్ సికె నాయుడు ట్రోఫీలో అత్య‌ధిక స్కోర్ న‌మోదు చేసిన బ్యాట‌ర్‌గా యశ్వర్ధన్ దలాల్ రికార్డుల‌కెక్కాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఉత్తరప్రదేశ్ స్టార్ ప్లేయర్ సమీర్ రిజ్వీ పేరిట ఉండేది. ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌరాష్ట్ర‌పై సమీర్ రిజ్వీ(312) ట్రిపుల్ సెంచ‌రీ సాధించాడు. తాజా మ్యాచ్‌తో రిజ్వీ ఆల్‌టైమ్ రికార్డును యశ్వర్ధన్ బ్రేక్ చేశాడు.
చదవండి: ENG vs WI: సాల్ట్ విధ్వంస‌క‌ర సెంచ‌రీ.. విండీస్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్‌

 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)