Breaking News

రంజీ సెమీఫైనల్‌ పోరుకు యశస్వి జైస్వాల్‌

Published on Fri, 02/14/2025 - 04:17

ముంబై: భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేసిన యశస్వి జైస్వాల్‌కు చాంపియన్స్‌ ట్రోఫీలో బరిలోకి దిగే భారత జట్టులో చోటు దక్కలేదు. ప్రాథమిక జట్టులో జైస్వాల్‌ను ఎంపిక చేసినా... అనంతరం స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి కోసం 15 మందితో కూడిన జట్టు నుంచి అతడిని తప్పించారు.

ప్రస్తుతానికి జైస్వాల్‌తో పాటు పేస్‌ ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబే ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి నాన్‌ ట్రావెలింగ్‌ రిజర్వ్‌లుగా ఉన్నారు. అత్యవసమైతేనే వీరు దుబాయ్‌కు వెళ్లనున్నారు. దీంతో రంజీ ట్రోఫీ సెమీఫైనల్‌ కోసం జైస్వాల్‌ ముంబై సెలెక్టర్లు ఎంపిక చేశారు. విదర్భతో ఈనెల 17 నుంచి జరగనున్న సెమీఫైనల్‌ పోరులో యశస్వి, సూర్యకుమార్, శివమ్‌ దూబే, అజింక్య రహానే, శార్దుల్‌ ఠాకూర్‌ వంటి భారత ఆటగాళ్లు ముంబై జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. 

ఈ సీజన్‌లో జమ్మూకశ్మీర్‌తో ఆడిన ఏకైక రంజీ మ్యాచ్‌లో జైస్వాల్‌ ఆకట్టుకోలేకపోయాడు. రోహిత్‌ శర్మతో కలిసి ఓపెనర్‌గా బరిలోకి దిగినా... భారీ ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు.  గతేడాది రంజీ ట్రోఫీ ఫైనల్లో విదర్భను చిత్తు చేసిన ముంబై జట్టు 42వసారి టైటిల్‌ చేజిక్కించుకుంది.  

ముంబై జట్టు: అజింక్య రహానే (కెప్టెన్  ), ఆయుశ్‌ మాత్రే, అంగ్‌క్రిష్‌ రఘువంశీ, అమోఘ్‌ భక్తల్, సూర్యకుమార్‌ యాదవ్, యశస్వి జైస్వాల్, సిద్ధేశ్‌ లాడ్, శివమ్‌ దూబే, ఆకాశ్‌ ఆనంద్, హార్దిక్‌ తమోర్, సూర్యాన్ష్ షెడ్గే, శార్దుల్‌ ఠాకూర్, షమ్స్‌ ములానీ, తనుశ్‌ కొటియాన్, మోహిత్‌ అవస్థి, సెల్వెస్టర్‌ డిసౌజ, రోస్టన్‌ డియాస్, అథర్వ అంకొలేకర్, హర్ష్ తన్నా.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)