Breaking News

బెయిల్స్ మార్చిన స్టార్క్‌.. ఇచ్చిపడేసిన యశస్వి జైశ్వాల్‌! వీడియో వైరల్‌

Published on Mon, 12/30/2024 - 09:28

మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. 340 పరుగుల లక్ష్య చేధనలో భారత్ పోరాడుతోంది. ఆఖరి రోజు తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా బౌలర్లు పైచేయి సాధించగా.. రెండో సెషన్‌లో మాత్రం టీమిండియా అద్బుతంగా తిరిగి పుంజుకుంది.

యశస్వి జైశ్వాల్‌, రిషబ్ పంత్ ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయితే ఆఖరి రోజు ఆటలో యశస్వి జైశ్వాల్‌, ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఏమి జ‌రిగిందంటే?
అద్భుతంగా ఆడుతున్న జైశ్వాల్ ఏకాగ్రతని దెబ్బ‌తీసేందుకు స్టార్క్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో  వికెట్ల‌పై ఉన్న బెయిల్స్‌ను మార్చాడు. ఈ క్ర‌మంలో జైస్వాల్ అసంతృప్తికి గురయ్యాడు. స్టార్క్ త‌న ర‌న్ ఆప్‌ను తీసుకునేందుకు వెళ్లిన వెంట‌నే య‌శ‌స్వి బెయిల్స్‌ను తిరిగి మార్చాడు.

దీంతో బంతి వేసిన త‌ర్వాత జైశ్వాల్‌ను స్టార్క్‌ ఏదో అన్నాడు. జైశ్వాల్‌​ కూడా అందుకు ధీటుగా బదులిచ్చాడు. ఇందుకు సంబంధిం‍చిన వీడియో ప్రస్తుతం సోషల్‌​ మీడియాలో వైరలవుతోంది. కాగా 50 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది.

క్రీజులో జైశ్వాల్‌(61 నాటౌట్‌), పంత్‌(22) పరుగులతో ఉన్నారు. భారత్‌ విజయానికి ఇంకా 236 పరుగులు అవసరమవ్వగా.. ఆసీస్‌కు 7 వికెట్లు కావాలి.అయితే ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే భారత్‌ డ్రా కోసం ఆడుతున్నట్లు అన్పిస్తోంది.
చదవండి: IND vs AUS: 'ఇక ఆడింది చాలు.. రిటైర్‌ అయిపో రోహిత్‌'..

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)