Breaking News

చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా

Published on Sat, 11/23/2024 - 15:12

పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టెస్టు మొద‌టి ఇన్నింగ్స్‌లో డ‌కౌటైన టీమిండియా స్టార్ ఓపెన‌ర్ య‌శ‌స్వీ జైశ్వాల్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఆసీస్ గ‌డ్డ‌పై తొలిసారి ఆడుతున్న జైశ్వాల్ సెంచ‌రీ దిశ‌గా దూసుకుపోతున్నాడు.

జైశ్వాల్ ప్రస్తుతం 90 పరుగులతో తన బ్యాటిం‍గ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఇప్పటివరకు 7 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. కేఎల్ రాహుల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను జైశ్వాల్ అద్భుతంగా ముందుకు నడపిస్తున్నాడు. 

జైశ్వాల్ వరల్డ్ రికార్డు..
ఈ క్ర‌మంలో జైశ్వాల్ ఓ అరుదైన ఘ‌న‌త‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు. ఒకే క్యాలెండ‌ర్ ఈయ‌ర్‌లో టెస్టుల్లో అత్య‌ధిక సిక్స్‌లు బాదిన ప్లేయ‌ర్‌గా వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. ఈ ఏడాది టెస్టు క్రికెట్‌లో జైశ్వాల్ ఇప్పటివరకు 34 సిక్స్‌లు బాదాడు. 

ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ దిగ్గజం బ్రెండన్ మెకల్లమ్ పేరిట ఉండేది. మెక్‌కల్లమ్ 2014 ఏడాదిలో టెస్టుల్లో 33 సిక్స్‌లు బాదాడు. తాజా మ్యాచ్‌లో నాథన్ లియోన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన జైశ్వాల్‌.. మెకల్లమ్ అల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేశాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌(26) ఉన్నారు.

ఇక రెండో రోజు ఆటలో కూడా ఆసీస్‌పై భారత్‌ ‍పై చేయి సాధించింది. రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. క్రీజులో ఓపెనర్లు యశస్వీ జైశ్వాల్‌(90), కేఎల్‌ రాహుల్‌(62) నాటౌట్‌గా ఉన్నారు. టీమిండియా ప్రస్తుతం 218 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
చదవండి: కేఎల్‌ రాహుల్‌ అవుట్‌పై రగడ.. స్పందించిన స్టార్క్‌

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)