ప్రపంచ మహిళల చెస్‌ చాంపియన్‌గా జు వెన్‌జున్‌

Published on Sat, 04/19/2025 - 01:52

మహిళల చదరంగంలో తనకు తిరుగులేదని చైనా గ్రాండ్‌మాస్టర్‌ జు వెన్‌జున్‌ మరోసారి నిరూపించుకుంది. క్లాసికల్‌ ఫార్మాట్‌లో వరుసగా ఐదోసారి ఆమె విశ్వవిజేతగా నిలిచింది. చైనాకే చెందిన టాన్‌ జోంగితో షాంఘైలో జరిగిన ప్రపంచ చెస్‌ మహిళల చాంపియన్‌షిప్‌ మ్యాచ్‌లో 34 ఏళ్ల జు వెన్‌జున్‌ 6.5–2 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. ఇద్దరి మధ్య 12 గేమ్‌లు జరగాల్సి ఉన్నా... తొమ్మిదో గేమ్‌లోనే జు వెన్‌జున్‌కు టైటిల్‌ ఖరారు కావడంతో మిగతా మూడు గేమ్‌లను నిర్వహించలేదు. 

తొమ్మిది గేమ్‌లలో జు వెన్‌జున్‌ ఐదు గేముల్లో గెలిచి, మూడు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, ఒక గేమ్‌లో ఓడిపోయింది. విజేతగా నిలిచిన జు వెన్‌జున్‌కు 3,41,000 డాలర్లు (రూ. 2 కోట్ల 91 లక్షలు), రన్నరప్‌ టాన్‌ జోంగికి 2,27,000 డాలర్లు (రూ. 1 కోటీ 93 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. 2018లో రెండుసార్లు (10 గేమ్‌ల ఫార్మాట్, నాకౌట్‌ ఫార్మాట్‌ వేర్వేరుగా) ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జు వెన్‌జున్‌ ఆ తర్వాత 2020లో, 2023లోనూ వరల్డ్‌ టైటిల్‌ను సాధించింది. 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)