Breaking News

9వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగి మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసిన ఆసీస్‌ బౌలర్‌

Published on Mon, 06/16/2025 - 13:13

ఆసీస్‌ యువ పేసర్‌ జేవియర్‌ బార్ట్‌లెట్‌ మేజర్‌ లీగ్‌ క్రికెట్‌లో ఓ మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు. ఎంఐ న్యూయార్క్‌తో ఇవాళ జరిగిన మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను.. ఓటమి అంచుల్లో ఉన్న తన జట్టును (శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్‌) నమ్మశక్యంకాని ఇన్నింగ్స్‌తో (25 బంతుల్లో 59 నాటౌట్‌; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) విజయతీరాలకు చేర్చాడు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎంఐ న్యూయార్క్‌.. క్వింటన్‌ డికాక్‌ (38 బంతుల్లో 63; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 

ఎంఐ ఇన్నింగ్స్‌లో మోనాంక్‌ పటేల్‌ (14 బంతుల్లో 20; ఫోర్‌, సిక్స్‌), కీరన్‌ పోలార్డ్‌ (16 బంతుల్లో 30; 4 సిక్సర్లు), సన్నీ పటేల్‌ (11 బంతుల్లో 20 నాటౌట్‌; 3 ఫోర్లు), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (11 బంతుల్లో 17; 2 సిక్సర్లు) కూడా బ్యాట్లు ఝులిపించారు.  కెప్టెన్‌ పూరన్‌ (7 బంతుల్లో 5) నిరాశపరిచాడు. యూనికార్న్స్‌ బౌలర్లలో హరీస్‌ రౌఫ్‌, కార్మీ లె రాక్స్‌, హసన్‌ ఖాన్‌ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేవియర్‌ బార్ట్‌లెట్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు.

అనంతరం బరిలోకి దిగిన యూనికార్న్స్‌.. నవీన్‌ ఉల్‌ హక్‌ (4-0-28-2), ట్రెంట్‌ బౌల్ట్‌ (4-0-39-1) రెచ్చిపోవడంతో 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో టిమ్‌ సీఫర్ట్‌ (33), హసన్‌ ఖాన్‌ (43) యూనికార్న్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశారు. 

అయితే వీరిద్దరు కూడా జట్టు స్కోర్‌ 110 పరుగుల లోపే ఔట్‌ కావడంతో యూనికార్న్స్‌ మరోసారి కష్టాల్లో పడింది. ఈ దశలో యూనికార్న్స్‌ను లేవనెత్తే బాధ్యతను బార్ట్‌లెట్‌ తీసుకున్నాడు. బార్ట్‌లెట్‌ నమ్మశక్యంకాని రీతిలో షాట్లు ఆడుతూ ఓటమి కొరల్లో ఉన్న తన జట్టును విజయతీరాలకు చేర్చాడు.

బార్ట్‌లెట్‌కు కెప్టెన్‌ కోరె ఆండర్సన్‌ (9), హరీస్‌ రౌఫ్‌ (10 నాటౌట్‌) సహకరించారు. వీరిద్దరు కేవలం స్ట్రయిక్‌ రొటేట్‌ చేస్తూ బార్ట్‌లెట్‌కు అవకాశం ఇవ్వగా, మిగతా పనినంతా అతనే చూసుకున్నాడు. బౌల్ట్‌ వేసిన ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో వరుసగా సిక్సర్‌, రెండు ఫోర్లు బాదిన బార్ట్‌లెట్‌ మ్యాచ్‌ను యూనికార్న్స్‌వైపు మళ్లించాడు. 

ఆ మరుసటి ఓవర్‌లో బౌండరీ సహా 6 పరుగులు చేసిన బార్ట్‌లెట్‌ కేవలం 21 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం 19వ ఓవర్‌లో 11 పరుగులు పిండుకున్న బార్ట్‌లెట్‌.. చివరి ఓవర్‌ తొలి బంతికి సిక్సర్‌ బాది యూనికార్న్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. 

ఈ మ్యాచ్‌లో యూనికార్న్స్‌ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. బార్ట్‌లెట్‌ నమ్మశక్యంకాని ఇన్నింగ్స్‌తో యూనికార్న్స్‌ను గెలిపించాడు. బార్ట్‌లెట్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌ 2025లో పంజాబ్‌ కింగ్స్‌కు ఆడాడు. అయితే అతనికి బ్యాటర్‌గా పెద్ద అవకాశాలు రాలేదు.

 

 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)