Breaking News

మిగతా వారు ఏదో ఒక రకంగా పనికొచ్చారు.. నువ్వేందుకు, దండగ.. ఉమేశ్‌పై ఫ్యాన్స్‌ ఫైర్‌

Published on Sat, 06/10/2023 - 12:37

ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప, ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవలేదు. గెలవడం పక్కన పెడితే, కనీసం డ్రా కూడా చేసుకోలేదు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 296 పరుగుల ఆధిక్యంలో ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. లంచ్‌ అనంతరం కొన్ని ఓవర్ల​ పాటు బ్యాటింగ్‌ చేసి, 450కిపైగా టార్గెట్‌ సెట్‌ చేయాలన్నది ఆసీస్‌ ప్రణాళిక కావచ్చు. క్రీజ్‌లో లబూషేన్‌ (41), గ్రీన్‌ (7) ఉన్నారు.

కాగా, ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలర్‌ ఉమేశ్‌యాదవ్‌ తేలిపోవడంపై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస ప్రభావం కూడా చూపలేకపోతున్నాడని దుమ్మెత్తిపోస్తున్నారు. ఉమేశ్‌ను అనవసరంగా తీసుకున్నారని మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడో లేదో తెలుసుకోకుండా ఉమేశ్‌ను లండన్‌ ఫ్లైట్‌ ఎక్కించారని ఆరోపిస్తున్నారు.

షమీ, సిరాజ్‌ స్పెషలిస్ట్‌ రైట్‌ ఆర్మ్‌ పేసర్లుగా ఉన్నప్పుడు, ఉమేశ్‌ను తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు. ఆసీస్‌ టాపార్డర్‌ లెఫ్ట్‌, రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్ల కలయికతో ఉంటుందని తెలిసినప్పుడు, మూడో పేసర్‌గా లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ను తీసుకోవాల్సి ఉండిందని అంటున్నారు. ఉనద్కత్‌పై కూడా సదభిప్రాయం లేనప్పుడు మ్యాచ్‌ విన్నర్‌, అనుభవజ్ఞుడైన అశ్విన్‌ను అయినా తీసుకోవాల్సిందని  కామెంట్స్‌ చేస్తున్నారు.

జట్టులో మిగతా ఆటగాళ్లంతా ఏదో ఒక​ రకంగా అయినా ఉపయోగపడ్డారని.. ఉమేశ్‌ తన పాత్రకు కనీస న్యాయం కూడా చేయలేకపోయాడని మండిపడుతున్నాడు. ఒకవేళ టీమిండియా ఓడిపోతే, దానికి ప్రధాన కారణం ఉమేశ్‌యాదవే అవుతాడని అంటున్నారు. స్పిన్నర్లుకు ఏ మాత్రం సహకరించని పిచ్‌పై జడేజా 3 వికెట్లు తీస్తే.. ఉమేశ్‌ 30 ఓవర్లలో కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే తీసి ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడని ధ్వజమెత్తుతున్నారు. ఓవరాల్‌గా ఉమేశ్‌ను టార్గెట్‌ చేసి దుమ్మెత్తిపోస్తున్నారు.

స్కోర్‌ వివరాలు..

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 469 ఆలౌట్‌ (హెడ్‌ 163, స్మిత్‌ 121, సిరాజ్‌ 4/108)
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 296 ఆలౌట్‌ (రహానే 89, ఠాకూర్‌ 51, కమిన్స్‌ 3/83)
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 123/4 (లబూషేన్‌ 41 బ్యాటింగ్‌, జడేజా 2/25)

ఆసీస్‌ 296 పరుగుల ఆధిక్యంలో ఉంది

చదవండి: ఆసీస్‌ పేసర్‌ సూపర్‌ డెలివరీ.. భరత్‌కు దిమ్మతిరిగిపోయింది! వీడియో వైరల్‌

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)