ఏపీలో రాష్ట్రపతి పాలన?
Breaking News
19 మంది మృతి ‘సర్వసాధారణం’!.. తొక్కిసలాటపై బీజేపీ మంత్రి
ఏపీలో ఎమర్జెన్సీ రోజులు తలపిస్తున్నాయి: పెద్దిరెడ్డి
చెన్నైలో భారీ వర్షం: అధికారులకు సీఎం విజయ్ ప్రత్యేక ఆదేశాలు
ఎన్నడూ లేనిది.. నితీష్‌ను పొగిడిన ప్రశాంత్ కిశోర్
హైకోర్టులో కూటమి సర్కార్‌కు చుక్కెదురు
వైఎస్సార్సీపీ ఆఫీస్ చుట్టూ ముళ్ల కంచెలు
దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19కి చేరిన మృతుల సంఖ్య
ఏపీలో గూండా రాజ్.. మూడో రోజూ దౌర్జన్యకాండ
‘స్థానిక’ ఎన్నికలు: వైఎస్సార్సీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల
దీప్కేను విడుదల చేసి.. సౌరవ్, ఆశుతోష్‌ను జైల్లోనే ఎందుకు ఉంచారు?
పసికందుపై అఘాయిత్యం, బతికుండగానే ఇసుకలో పాతేశాడు!
చంద్రబాబు ఆదేశాలతోనే పోలీసులు కాల్పులు జరిపారు: సజ్జల
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సంచలన వ్యాఖ్యలు
లాఠీఛార్జ్ చేశారు.. టియర్ గ్యాస్ ప్రయోగించారు: లేళ్ల అప్పిరెడ్డి
ఈసీకి వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు
39 గంటల రెస్క్యూ ఆపరేషన్ : 9 ఏళ్ల బాలుడి విషాదాంతం
గ్లాస్గోలో కుప్ప కూలిన విమానం, ఇద్దరు మృతి
టీడీపీ గూండాల చేతుల్లో వేటకొడవళ్లు, పెట్రోల్: అవినాశ్ రెడ్డి
పులివెందులలో ఏకే 47తో కాల్పులు
WTC Final: సెంచరీ పూర్తి చేసుకున్న స్టీవ్ స్మిత్, ఒక్క సెంచరీతో ఎన్ని రికార్డులో..!
Published on Thu, 06/08/2023 - 15:32
ఓవల్ వేదికగా జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా పట్టు బిగించింది. రెండో రోజు ఆట ప్రారంభం కాగానే స్టీవ్ స్మిత్ సెంచరీ పూర్తి చేశాడు. సిరాజ్ బౌలింగ్‌లో వరుస బౌండరీలు బాది స్మిత్ కెరీర్లో 31వ శతకాన్ని సాధించాడు. ఈ సెంచరీతో స్మిత్ పలు రికార్డులను నెలకొల్పాడు.
- ఇంగ్లండ్ గడ్డపై స్మిత్‌కు ఇది 7వ సెంచరీ
- ఆస్ట్రేలియా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 3వ స్థానం. రికీ పాంటింగ్ (41), స్టీవ్ వా (32) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- టీమిండియాపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో జో రూట్‌తో పాటు అగ్రస్థానం. రూట్, స్మిత్‌లు ఇద్దరు టీమిండియాపై 9 శతకాలు బాదారు.
- పర్యాటక జట్టు తరఫున ఇంగ్లండ్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ వాతో పాటు రెండో స్థానం. స్టీవ్ వా, స్మిత్‌లు ఇద్దరు చెరో 7 సెంచరీలు చేయగా.. టాప్‌లో సర్ డాన్ బ్రాడ్‌మన్ (11) ఉన్నారు.
- పర్యాటక జట్టు తరఫున ఇంగ్లండ్‌లోని ఓ వేదికపై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానం. స్టీవ్ స్మిత్ ఓవల్ మైదానంలో 3 సెంచరీలు చేశాడు. డాన్ బ్రాడ్‌మన్ హెడింగ్లేలో అత్యధికంగా 4 సెంచరీలు, ట్రెంట్‌బ్రిడ్జ్‌లో 3 సెంచరీలు చేశాడు. భారత్ తరఫున దిలీప్ వెంగ్‌సర్కార్ లార్డ్స్‌లో 3 సెంచరీలు చేశాడు.
- భారత్-ఆస్ట్రేలియా మధ్యలో టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం (9). ఈ జాబితాలో సచిన్ (11) టాప్‌లో ఉన్నాడు.
- ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో కనీసం 2 సెంచరీలు చేసిన ఏడో ఆటగాడు. గంగూలీ (3), పాంటింగ్ (3), సయీద్ అన్వర్ (3), జయవర్దనే (2), రోహిత్ శర్మ (2), వాట్సన్ (2) స్టీవ్ స్మిత్ కంటే ముందున్నారు.
కాగా, 91 ఓవర్ల తర్వాత ఆసీస్ స్కోర్ 361/3గా ఉంది. ట్రవిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (110) క్రీజ్‌లో ఉన్నారు.
చదవండి: WTC Final: ట్రవిస్ హెడ్.. ద గేమ్ ఛేంజర్, ఎదురుదాడే లక్ష్యం
#
Tags : 1