Breaking News

WTC Final: అరుదైన క్లబ్‌లో మిచెల్‌ స్టార్క్‌.. నాలుగో బౌలర్‌గా..!

Published on Sat, 06/10/2023 - 15:43

ఓవల్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా.. టీమిండియా ముందు భారీ లక్ష్యం ఉంచేలా ఉంది. 123/4 స్కోర్‌ వద్ద నాలుగో ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. ఆదిలోనే లబూషేన్‌ (41) వికెట్‌ కోల్పోయినప్పటికీ 300 పరుగుల లీడ్‌ను సాధించింది.  ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో పుజారాకు క్యాచ్‌ ఇచ్చి లబూషేన్‌ ఔటయ్యాడు. 

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆటగాడు మహ్మద్‌ షమీని ఔట్‌ చేయడంతో ఆసీస్‌ స్పీడ్‌స్టర్‌ మిచెల్‌ స్టార్క్‌ ఓ అరుదైన క్లబ్‌లో చేరాడు. స్టార్క్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో (మూడు ఫార్మాట్లు కలిపి) 600 వికెట్లు పడగొట్టిన 24వ ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఆసీస్‌ తరఫున షేన్‌ వార్న్‌ (999), మెక్‌గ్రాత్‌ (948), బ్రెట్‌ లీ (718) తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ స్పిన్నర్‌ మురళీథరన్‌ (1347) అగ్రస్థానంలో ఉండగా.. షేన్‌ వార్న్‌, జేమ్స్‌ ఆండర్సన్‌ (972), అనిల్‌ కుంబ్లే (956), మెక్‌గ్రాత్‌ టాప్‌=5లో ఉన్నారు. భారత బౌలర్లలో కుంబ్లే, హర్భజన్‌ (711), అశ్విన్‌ (697), కపిల్‌ దేవ్‌ (687), జహీర్‌ ఖాన్‌ (610) స్టార్క్‌ కంటే ముందున్నారు.  

స్కోర్‌ వివరాలు..

  • ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌: 469 ఆలౌట్‌ (హెడ్‌ 163, స్మిత్‌ 121, సిరాజ్‌ 4/108)
  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 296 ఆలౌట్‌ (రహానే 89, ఠాకూర్‌ 51, కమిన్స్‌ 3/83)
  • ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌: 138/5 (లబూషేన్‌ 41, జడేజా 2/25)

ఆసీస్‌ 311 పరుగుల ఆధిక్యంలో ఉంది

చదవండి: విధ్వంసం సృష్టించిన కర్రన్‌ బ్రదర్స్‌.. సిక్సర్ల సునామీ 

Videos

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)