Breaking News

WTC Final: కేఎస్‌ భరత్‌పై నమ్మకం లేదు..!

Published on Mon, 06/05/2023 - 12:19

వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ 2021-23 ఫైనల్‌కు ముందు టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఓ విషయం పెద్ద సమస్యగా మారింది. ఫైనల్‌ మ్యాచ్‌లో వికెట్‌కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై వారు తలలు పట్టుకుని కూర్చున్నారు. ఈ విషయంపై విశ్లేషకులు, మాజీలు, అభిమానులు ఎవరికి తోచిన సలహాలు వారు ఇస్తున్నారు. అయినా మేనేజ్‌మెంట్‌ ఎటూ తేల్చుకోలేకపోతుంది.

తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ మరోసారి స్పందించాడు. తొలుత భారత వికెట్‌కీపర్‌గా కేఎస్‌ భరత్‌ బెటర్‌ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన భజ్జీ.. తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌తో మాట్లాడుతూ మాట మార్చాడు. భరత్‌తో పోలిస్తే ఇషాన్‌ కిషన్‌ బెటర్‌ ఆప్షన్‌ అవుతాడని అభిప్రాయపడ్డాడు. 4 మ్యాచ్‌ల్లో కేవలం 101 పరుగులు చేసిన భరత్‌పై అంత నమ్మకం కలగడం లేదని, అతని కంటే ధాటిగా బ్యాటింగ్‌ చేయగల ఇషాన్‌ను ఆడించడమే సమంజసమని అన్నాడు.

ఇషాన్‌కు రిషబ్‌ పంత్‌లా అగ్రెసివ్‌గా ఆడే సామర్థ్యం ఉందని, అతను ఇంత వరకు టెస్ట్‌ అరంగేట్రం చేయలేదని కారణం చూపి ఆడించకపోతే టీమిండియాకే లాస్‌ అవుతుందని తెలిపాడు. పైగా ఇషాన్‌ ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో మంచి టచ్‌లో ఉన్నాడని, ఐదు, ఆరు స్థానాల్లో అతను బరిలోకి దిగితే రెండో కొత్త బంతితో ఆడుకుంటాడని పేర్కొన్నాడు. వికెట్‌కీపింగ్‌ విషయానికొస్తే తన ఓటు భరత్‌కే అయినప్పటికీ.. అందుకోసం ఓ బ్యాటర్‌ను కోల్పోలేమని చెప్పుకొచ్చాడు. ఫైనల్‌గా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు తన ఛాయిస్‌ ఇషానే అని చెప్పకనే చెప్పాడు. ఇదిలా ఉంటే, డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఓవల్‌ మైదానం వేదికగా జూన్‌ 7 నుంచి 11 వరకు జరుగనున్న విషయం తెలిసిందే. 

చదవండి: WTC Final IND VS AUS: ఐసీసీ ఫైనల్స్‌లో ఎవరెన్ని గెలిచారు..?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)