Breaking News

తిరిగి బెంగాల్‌ గూటికి చేరిన సాహా

Published on Tue, 08/13/2024 - 15:44

వెటరన్‌ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ వృద్ధిమాన్‌ సాహా దేశవాలీ క్రికెట్‌లో తిరిగి బెంగాల్‌ గూటికి చేరాడు. సాహా రెండేళ్ల కింద బెంగాల్‌ నుంచి త్రిపురకు వలస వెళ్లాడు. తాజాగా మనసు మార్చుకున్న సాహా తిరిగి బెంగాల్‌ జట్టుతో జత కట్టేందుకు సిద్ధమయ్యాడు. మూడు ఫార్మాట్లలో బెంగాల్‌ టీమ్‌కు అందుబాటులో ఉంటానని ‍ప్రకటించాడు. 

సుదీర్ఘ అనుబంధం ఉన్న బెంగాల్‌ జట్టులో తిరిగి చేరడం ఆనందంగా ఉందని, తదుపరి దేశవాలీ సీజన్‌లో ఆడేందుకు ఆతృతగా ఉన్నానని సాహా తెలిపాడు. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (క్యాబ్‌) అధ్యక్షుడు స్నేహశిష్‌ గంగూలీతో కలిసి ప్రెస్‌మీట్‌ పెట్టి సాహా ఈ విషయాలను వెల్లడించాడు. సాహా రీఎంట్రీపై స్నేహశిష్‌ సైతం హర్షం వ్యక్తం చేశాడు. సాహాను బెంగాల్‌ జట్టులోకి సాధరంగా ఆహ్వానిస్తున్నట్లు స్నేహశిష్‌ తెలిపాడు. 

గతంలో సాహా బెంగాల్‌ జట్టుకు ఎంతో చేశాడని, అతని చేరిక బెంగాల్‌ జట్టును మరింత పటిష్ట పరుస్తుందని స్నేహశిష్‌ అభిప్రాయపడ్డాడు. వయసు మీద పడటంతోపై సాహా స్పందిస్తే.. అది కేవలం అంకెలకు మాత్రమే పరిమితం అని, తనలో క్రికెట్‌ ఆడే ఓపిక ఇంకా ఉందని అన్నాడు. ప్రస్తుత బెంగాల్‌ జట్టు యువకులు, అనుభవజ్ఞులతో సమతూకంగా ఉందని.. జట్టుకు అవసరమైన ఏ సేవలైనా అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సాహా తెలిపాడు.

39 ఏళ్ల సాహా టీమిండియా తరఫున 40 టెస్ట్‌లు, 9 వన్డేలు ఆడి 3 సెంచరీలు, 6 హాఫ్‌ సెంచరీలు చేశాడు. సాహా ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. లేటు వయసులోనూ సాహా ఐపీఎల్‌లో సత్తా చాటుతున్నాడు. 
 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)