Breaking News

రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా స్టార్‌ క్రికెటర్‌

Published on Mon, 11/04/2024 - 09:32

టీమిండియా వెట‌ర‌న్ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ వృద్ధిమాన్ సాహా సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు సాహా రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజ‌న్ త‌ర్వాత త‌ను క్రికెట్ నుంచి వైదొల‌గ‌నున్న‌ట్లు సాహా సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించాడు.

క్రికెట్‌లో నా సుదీర్ఘ ప్ర‌యాణానికి విడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాను. నా కెరీర్‌లో ఈ రంజీ సీజ‌నే నా చివ‌రిది.  ఆఖరిసారిగా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వ‌హిస్తుండ‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన ప్ర‌యాణంలో మ‌ద్ద‌తుగా నిలిచిన  ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఎక్స్‌లో సాహా రాసుకొచ్చాడు. కాగా 40 ఏళ్ల సాహా వయసు రీత్యా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఈ బెంగాల్ స్టార్ ప్లేయ‌ర్ గ‌త మూడేళ్ల‌గా జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉంటున్న‌ప్ప‌ట‌కి..ఐపీఎల్‌, ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో మాత్రం భాగ‌మ‌వుతూ వ‌స్తున్నాడు. ఐపీఎల్‌లో గ‌త కొన్నేళ్ల‌గా గుజ‌రాత్ టైటాన్స్‌కు వృద్ధిమాన్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్నాడు.

అయితే వ‌చ్చే ఏడాది సీజ‌న్‌కు ముందు అత‌డిని గుజ‌రాత్ విడిచిపెట్టింది. ఈ క్ర‌మంలో అత‌డు ఐపీఎల్‌-2025 మెగా వేలంలో త‌న పేరును కూడా సాహా న‌మోదు చేసుకోపోయిన‌ట్లు తెలుస్తోంది. సాహా తన చివరి టెస్టు  2021లో న్యూజిలాండ్‌పై ఆడాడు.

ధోని త‌ర్వాత‌..
అయితే టెస్టు క్రికెట్‌లో భార‌త్ చూసిన అత్యుత్త‌మ వికెట్ కీప‌ర్ల‌లో స‌హా ఒక‌డ‌ని చెప్పుకోవ‌చ్చు. అత‌డికి అద్భుత‌మైన వికెట్ కీపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ధోని రిటైర్మెంట్ త‌ర్వాత సాహా భార‌త టెస్టు జ‌ట్టులో రెగ్యూల‌ర్ వికెట్ కీప‌ర్‌గా కొన‌సాగాడు. వృద్ధిమాన్ సాహా భారత్ తరపున 40 టెస్టులు  ఆడి 1353 పరుగులు చేశాడు.

 అత‌డి టెస్టు కెరీర్‌లో మూడు సెంచ‌రీలు ఉన్నాయి. అదేవిధంగా .. 9వన్డేలు ఆడి 41 ప‌రుగులు చేశాడు. ఇక ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై,కోల్ కతా నైట్ రైడర్స్,  పంజాబ్ కింగ్స్ ,స‌న్‌రైజ‌ర్స్ హైదరాబాద్ లకు ప్రాతినిధ్యం వహించచిన సాహా మొత్తంగా 170 మ్యాచ్‌లు ఆడాడు.
చదవండి: IND vs NZ: టీమిండియా వైట్‌ వాష్‌.. అజింక్య రహానే పోస్ట్‌ వైరల్‌
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)