Breaking News

'అది మేము కాదు.. మా ఫోటోలను మార్ఫింగ్‌ చేశారు!'

Published on Mon, 05/29/2023 - 17:32

డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా టాప్‌ రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు శాంతియుత ర్యాలీ చేపట్టారు.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీకి వెళ్తున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్, భజరంగ్‌ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కాగా, రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఫొటోల్లో వినేశ్‌ ఫోగట్‌, సంగీత ఫోగట్‌ పోలీసు వ్యాన్‌లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉంది. ఈ ఫొటోలపై రెజ్లర్లు స్పందించారు. తమ ఫొటోలను కొందరు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని ఆరోపించారు.

''కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(AI Technology) ఉపయోగించి మొహాలనే మార్చేస్తున్నారు.. మేమెంత చెప్పండి.. మా నిరసనపై బురద జల్లే ప్రయత్నంలో  కొందరు గిట్టని వ్యక్తులు ఇలాంటి తప్పుడు చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నకిలీ ఫొటోను పోస్ట్‌ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తాం'' అని భజరంగ్‌ పునియా ట్వీట్‌ చేశాడు.

దీనిపై సాక్షి మలిక్‌ స్పందిస్తూ..''అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్‌ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు'' అని మండిపడ్డారు.

చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)