Breaking News

గుజరాత్‌ను గెలిపించిన సోఫీ డివైన్‌

Published on Wed, 01/28/2026 - 00:32

వడోదర: అప్పుడు ముంబైలో... ఇప్పుడు వడోదరలో... ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్‌ జెయింట్స్‌ల మధ్య ఆఖరి బంతిదాకా ఉత్కంఠ రేపిన పోరులో గుజరాతే పైచేయి సాధించింది. ఈ రెండు సందర్భాల్లోనూ సోఫీ డివైన్‌ చివరి ఓవరే గెలవాల్సిన ఢిల్లీని ఓడించింది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో జెయింట్స్‌ 3 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిచింది. ముందుగా గుజరాత్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఓపెనర్‌ బెత్‌ మూనీ (58; 7 ఫోర్లు) రాణించింది. ఆంధ్రప్రదేశ్‌ స్పిన్నర్‌ నల్లపురెడ్డి శ్రీచరణి (4/31) తిప్పేసింది. 

అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసి ఓడింది. ఢిల్లీ విజయానికి ఆఖరి 24 బంతుల్లో 60 పరుగులు కావాల్సిన దశలో నికీ ప్రసాద్‌ (24 బంతుల్లో 47; 9 ఫోర్లు), స్నేహ్‌ రాణా (15 బంతుల్లో 29; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచేశారు. డివైన్‌ 17వ ఓవర్లో 23 పరుగులు, గార్డ్‌నర్‌ 19వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. దాంతో ఢిల్లీ గెలవాలంటే ఆఖరి ఓవర్లో 9 పరుగులు చేయాలి. కానీ సోఫీ డివైన్‌ ఆఖరి ఓవర్లో 5 పరుగులే ఇచ్చి నికీ, స్నేహ్‌లను అవుట్‌ చేయడంతో గుజరాత్‌ ఓటమి కోరల్లోంచి బయటపడి గెలిచింది. నేడు విశ్రాంతి దినం. గురువారం జరిగే మ్యాచ్‌లో బెంగళూరు జట్టుతో యూపీ వారియర్స్‌ ఆడుతుంది.  

స్కోరు వివరాలు 
గుజరాత్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: మూనీ (సి) జెమీమా (బి) నందిని 58; సోఫీ డివైన్‌ (బి) కాప్‌ 13; అనుష్క (సి) మిన్నుమణి (బి) శ్రీచరణి 39; గార్డ్‌నర్‌ (సి) స్నేహ్‌ రాణా (బి) మిన్నుమణి 2; వేర్‌హమ్‌ (బి) శ్రీచరణి 11; భారతి (బి) చినెల్లి హెన్రీ 3; కనిక (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీచరణి 4; కాశ్వీ (బి) శ్రీచరణి 2; తనూజ (సి) శ్రీచరణి (బి) చినెల్లి హెన్రీ 21; రేణుక (నాటౌట్‌) 3; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–19, 2–73, 3–96, 4–128, 5–131, 6–135, 7–139, 8–151, 9–174. బౌలింగ్‌: కాప్‌ 4–0–34–1, చినెల్లి 4–0–38–2, నందిని 4–0– 26–1, శ్రీచరణి 4–0–31–4, స్నేహ్‌ రాణా 1–0– 11–0, మిన్ను మణి 3–0–23–1. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: షఫాలీ (సి) గార్డ్‌నర్‌ (బి) రాజేశ్వరి 14; లిజెల్లీ (సి) గార్డ్‌నర్‌ (బి) సోఫీ 11; వోల్వార్డ్‌ (బి) రాజేశ్వరి 24; జెమీమా (బి) సోఫీ 16; కాప్‌ (బి) గార్డ్‌నర్‌ 0; చినెల్లి (సి) గార్డ్‌నర్‌ (బి) రాజేశ్వరి 9; నికీ ప్రసాద్‌ (సి) గార్డ్‌నర్‌ (బి) డివైన్‌ 47; స్నేహ్‌ రాణా (సి) వేర్‌హమ్‌ (బి) సోఫీ 29; మిన్ను మణి (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 20; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 171. వికెట్ల పతనం: 1–26, 2–51, 3–82, 4–83, 5–85, 6–100, 7–170, 8–171. బౌలింగ్‌: రేణుక 1–0–16–0, కాశ్వీ గౌతమ్‌ 2–0–18–0, రాజేశ్వరి 4–0–20–3, సోఫీ డివైన్‌ 4–0–37–4, తనూజ 4–0–26–0, ఆష్లే గార్డ్‌నర్‌ 4–0–37–1,  వేర్‌హమ్‌ 1–0–12–0. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)