Breaking News

రిచా మెరుపులు వృథా.. ఆర్సీబీపై ముంబై విజయం

Published on Mon, 01/26/2026 - 23:09

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్-2026లో వరుసగా మూడు పరాజయాల తర్వాత ముంబై ఇండియ‌న్స్ గెలుపు బాట ప‌ట్టింది. సోమ‌వారం వ‌డోద‌ర వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరుతో జ‌రిగిన కీల‌క మ్యాచ్‌లో 15 ప‌రుగుల తేడాతో ముంబై ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో హ‌ర్మ‌న్ సేన త‌మ ప్లే ఆఫ్ ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది.

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల నష్టానికి 199 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ముంబై స్టార్ ఆల్‌రౌండర్ నటాలీ స్కివర్ బ్రంట్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో సెంచరీ చేసిన ప్లేయర్‌గా స్కివర్ రికార్డులెక్కింది. 

57 బంతులు ఎదుర్కొన్న స్కివర్‌ 16 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. ఆమెతో పాటు హీలీ మాథ్యూస్(56) హాఫ్ సెంచరీతో సత్తాచాటింది.  వీరిద్దరూ రెండో వికెట్‌కు 131 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆర్సీబీ బౌలర్లలో లారెన్ బెల్ రెండు, శ్రేయంకా పాటిల్, ఎన్‌డి క్లార్క్ తలా వికెట్ సాధించారు.

రిచా విధ్వంసం..
అనంతరం భారీ లక్ష్య చేధనలో ఆర్సీబీ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు మాత్రమే చేసింది. టాపార్డర్ బ్యాటర్లు విఫలమైనప్పటికి రిచా ఘోష్ మాత్రం విధ్వంసం సృష్టించింది. ఐదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిచా.. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగింది.

కేవలం 49 బంతుల్లోనే 10 ఫోర్లు, 6 సిక్స్‌లతో 90 పరుగులు చేసింది. సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఆర్సీబీ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లలో మాథ్యూస్ మూడు వికెట్లు పడగొట్టగా.. ఇస్మాయిల్‌, అమీలియా కేర్ తలా రెండు వికెట్లు సాధించారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)