Breaking News

యూపీ వారియర్జ్‌కు కొత్త కెప్టెన్‌.. దీప్తి శర్మపై వేటు

Published on Sun, 01/04/2026 - 20:05

మహిళల ఐపీఎల్‌ 2026 (WPL) ప్రారంభానికి ముందు యూపీ వారియర్జ్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఫ్రాంచైజీ నూతన కెప్టెన్‌గా ఆసీస్‌ దిగ్గజం మెగ్‌ లాన్నింగ్‌ను నియమించింది. ఈ విషయాన్ని వారియర్జ్‌ యాజమాన్యం సోషల్‌మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.

33 ఏళ్ల లాన్నింగ్‌ను వారియర్జ్‌ ఈ సీజన్‌ వేలంలో రూ. 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. లాన్నింగ్‌ నియామకంతో గత సీజన్‌ వరకు కెప్టెన్‌గా వ్యవహంచిన దీప్తి శర్మపై వేటు పడింది. రానున్న సీజన్‌లో దీప్తి సాధారణ ప్లేయర్‌గా కొనసాగుతుంది. దీప్తిని ఈ సీజన్‌ వేలంలో వారియర్జ్‌ యాజమాన్యం రూ. 3.2 కోట్లు వెచ్చించి, తిరిగి సొంతం చేసుకుంది.

లాన్నింగ్‌కు కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. ఆమె సారథ్యంలో ఆసీస్‌ ఓ వన్డే ప్రపంచకప్‌, 4 టీ20 ప్రపంచకప్‌లు గెలిచింది. డబ్ల్యూపీఎల్‌ కెప్టెన్‌గానూ లాన్నింగ్‌కు మంచి ట్రాక్‌ రికార్డే ఉంది. ఈమె నేతృత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ వరుసగా మూడు ఎడిషన్లలో ఫైనల్‌కు చేరింది. లాన్నింగ్‌ను డీసీ యాజమాన్యం ఇటీవలే విడుదల చేసింది.

లాన్నింగ్‌ సారథ్యంలో వారియర్జ్‌ పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. ఈ ఫ్రాంచైజీ డబ్ల్యూపీఎల్‌ చరిత్రలో అత్యంత పేలవమైన ట్రాక్‌ రికార్డు ఉన్న జట్టుగా ఉంది. తొలి ఎడిషన్‌లో (2023) ఐదింటి మూడో స్థానంలో నిలిచిన ఈ జట్టు.. సీజన్‌ సీజన్‌కు మరింత దిగజారుతూ నాలుగు (2024), ఐదు (2025) స్థానాలకు పడిపోయింది. 

కాగా, డబ్ల్యూపీఎల్‌ 2026 జనవరి 9 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. సీజన్‌ ఓపెనర్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌, ఆర్సీబీ తలపడనున్నాయి. వారియర్జ్‌ తమ తొలి మ్యాచ్‌ను జనవరి 10న (గుజరాత్‌ జెయింట్స్‌తో) ఆడనుంది. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)