Breaking News

రాణించిన గార్డ్‌నర్‌, వేర్హమ్‌.. గుజరాత్‌ స్కోర్‌ ఎంతంటే..?

Published on Fri, 01/30/2026 - 21:19

డబ్ల్యూపీఎల్‌ 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో ఇవాళ (జనవరి 30) జరుగుతున్న కీలక మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ ఓ మోస్తరు స్కోర్‌ చేసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ (46), అనుష్క శర్మ (33), సోఫీ డివైన్‌ (25) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో జార్జియా వేర్హమ్‌ (44 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించింది. 

భారతి ఫుల్మాలి 5 పరుగులతో అజేయంగా నిలిచింది. గుజరాత్‌ ఇన్నింగ్స్‌లో బెత్‌ మూనీ (5) మినహా ప్రతి ఒక్కరు ఓ మోస్తరు స్కోర్‌ చేశారు. ముంబై బౌలర్లలో అమేలియా కెర్‌ (4-0-26-2) అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ (4-0-29-1), నాట్‌ సీవర్‌ బ్రంట్‌ (4-0-36-1) కూడా పర్వాలేదనిపించారు. 

హేలీ మాథ్యూస్‌ (4-0-40-0), వైష్ణవి శర్మ (2-0-21-0) ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. అమన్‌జోత్‌ కౌర్‌ (2-0-13-0) పర్వాలేదనిపించింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ గెలిస్తే ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ను ఖరారు చేసుకుంటుంది.  ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో ఆర్సీబీ తర్వాత రెండో స్థానంలో ఉంది. 

ఆర్సీబీ 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి నేరుగా ఫైనల్‌ బెర్త్‌ ఖరారు చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన రెండు బెర్త్‌ల కోసం గుజరాత్‌తో పాటు ముంబై ఇండియన్స్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు), ఢిల్లీ క్యాపిటల్స్‌ (7 మ్యాచ్‌ల్లో 3 విజయాలు) పోటీ పడుతున్నాయి. యూపీ వారియర్జ్‌ 7 మ్యాచ్‌ల్లో రెండే విజయాలతో టేబుల్‌ చివరి స్థానంలో ఉంది. 
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)