Breaking News

ఆర్సీబీకి తొలి ఓటమి.. ఢిల్లీ ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవం

Published on Sat, 01/24/2026 - 22:57

మహిళల ప్రీమియర్ లీగ్‌-2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు తొలి ఓటమి ఎదురైం‍ది. వడోదర వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 109 పరుగులకే కుప్పకూలింది.

ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్ధిని నామమాత్రపు స్కోరే పరిమితం చేశారు. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ మూడు వికెట్లు పడగొట్టగా.. హెన్రీ, కాప్‌, మిన్ను మని తలా రెండు వికెట్లు సాధించారు. ఆర్సీబీ బ్యాటర్లలో కెప్టెన్‌ స్మృతి మంధాన(38) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయరంతా దారుణంగా విఫలమయ్యారు.

అనంతరం 110 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 15.4 ఓవర్లలో చేధించింది. ఢిల్లీ బ్యాటర్లలో లారా వోల్వడర్ట్‌(42), కాప్‌(19) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశారు. ఆర్సీబీ బౌలర్లలో సత్ఘరే రెండు, రాధా యాదవ్‌ ఓ వికెట్‌ సాధించారు. ఈ విజయంతో ఢిల్లీ తమ ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వరుసగా ఐదు మ్యాచ్‌లలో విజయం సాధించిన ఆర్సీబీ ఇప్పటికే ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)