Breaking News

ఆర్సీబీ చెత్త ప్రదర్శన.. స్వల్ప స్కోర్‌కే పరిమితం

Published on Thu, 02/27/2025 - 21:35

డబ్ల్యూపీఎల్‌ 2025 ఎడిషన్‌లో ఆర్సీబీ మరో చెత్త ప్రదర్శన చేసింది. గుజరాత్‌ జెయింట్స్‌తో ఇవాళ (ఫిబ్రవరి 27) జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. స్టార్‌ బ్యాటర్లందరూ విఫలం కావడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ స్మృతి మంధన 20 బంతుల్లో 10, ఈ సీజన్‌లో భీకర ఫామ్‌లో ఉన్న ఎల్లిస్‌ పెర్రీ 4 బంతులు ఎదుర్కొని డకౌటైంది. 

ఓపెనర్‌ వ్యాట్‌ హాడ్జ్‌ 4, రిచా ఘోష్‌ 9 పరుగులకు ఔటయ్యారు. కనిక అహూజా (28 బంతుల్లో 33), రాఘ్వి బిస్త్‌ (22), జార్జియా వేర్హమ్‌ (20 నాటౌట్‌) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆర్సీబీ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖర్లో కిమ్‌ గార్త్‌ (14) రెండంకెల స్కోర్‌ చేసింది. స్నేహ్‌ రాణా ఒక పరుగుతో అజేయంగా నిలిచింది. గుజరాత్‌ బౌలర్లలో కశ్వీ గౌతమ్‌ (4-0-17-1), తనూజా కన్వర్‌ (4-0-16-2), కెప్టెన్‌ ఆష్లే గార్డ్‌నర్‌ (4-0-22-1), డియాండ్రా డొట్టిన్‌ (4-0-31-2) అద్భుతంగా బౌలింగ్‌ చేశారు.

కాగా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా ఈ సీజన్‌ బరిలోకి దిగిన ఆర్సీబీ తొలి రెండు మ్యాచ్‌ల్లో అద్బుత ప్రదర్శనలు నమోదు చేసి వరుస విజయాలు సాధించింది. అయితే ఆతర్వాత ఏమైందో ఏమో కాని ఆర్సీబీ లయ తప్పింది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. యూపీ వారియర్జ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శనలే చేసినప్పటికీ.. సూపర్‌ ఓవర్‌లో ఓటమిపాలైంది. ఈ సీజన్‌లో ఆ జట్టు నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. 

ప్రస్తుతం ముంబై ఇండియన్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ముంబై ఈ సీజన్‌లో నాలుగింట మూడు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రెండో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఉంది. ఈ జట్టు ఐదింట మూడు మ్యాచ్‌ల్లో గెలిచింది. మూడో స్థానంలో ఉన్న ఆర్సీబీ నాలుగింట రెండు మ్యాచ్‌ల్లో గెలిచింది. నాలుగో స్థానంలో ఉన్న వారియర్జ్‌ ఐదింట రెండు మ్యాచ్‌లు గెలిచింది. గత రెండు సీజన్లలాగే పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న గుజరాత్‌ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకటి మాత్రమే గెలిచింది. 
 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి