Breaking News

మినీ వేలం.. విండీస్‌ అల్‌రౌండర్‌కు భారీ మొత్తం

Published on Sun, 12/15/2024 - 16:27

మహిళల ఐపీఎల్‌ (WPL) మినీ వేలం బెంగళూరు వేదికగా ఇవాళ (డిసెంబర్‌ 15) జరుగుతుంది. ఈ వేలంలో విండీస్‌ ఆల్‌రౌండర్‌, లేడీ యూనివర్సల్‌ బాస్‌గా పిలువబడే డియాండ్రా డొట్టిన్‌ను గుజరాత్‌ జెయింట్స్‌ రూ. 1.7 కోట్ల భారీ మొత్తనికి సొంతం చేసుకుంది. ఇవాళ జరుగుతున్న మినీ వేలంలో మొదటిగా సోల్డ్‌ ఔటైన ప్లేయర్‌ డొట్టినే. డొట్టిన్‌ను 2023 డబ్ల్యూపీఎల్‌ ఇనాగురల్‌ ఎడిషన్‌లో కూడా గజరాత్‌ జెయింట్సే సొంతం చేసుకుంది. 

ఆ సీజన్‌లో జెయింట్స్‌ డొట్టిన్‌ను రూ. 60 లక్షలకు దక్కింంచుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ లీగ్‌ ప్రారంభానికి ముందే జెయింట్స్‌ డొట్టిన్‌ను వదిలేసింది. డొట్టిన్‌ తొలుత 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కలు పలికింది. అయితే ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ముందు డొట్టిన్‌ తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ యేడు పొట్టి ప్రపంచకప్‌లో డొట్టిన్‌ అద్భుతమైన ప్రదర్శన చేసింది. ఐదు ఇన్నింగ్స్‌ల్లో 120 పరుగులు చేయడంతో పాటు ఐదు వికెట్లు తీసింది.

కాగా, ఈసారి మెగా వేలంలో గుజరాత్‌ జెయింట్సే అత్యధిక పర్స్‌ వాల్యూతో బరిలోకి దిగింది. జెయింట్స్‌ వద్ద రూ.4.4 కోట్ల పర్స్‌ బ్యాలెన్స్‌ ఉంది. ఈ మొత్తంతో జెయింట్స్‌ కేవలం నాలుగు స్లాట్లు మాత్రమే భర్తీ చేసుకునే అవకాశం ఉంది. డొట్టిన్‌ కోసం​ జెయింట్స్‌తో పాటు యూపీ వారియర్జ్‌ తీవ్రంగా పోటీపడింది. అయితే అంతిమంగా డొట్టిన్‌ను జెయింట్సే దక్కించుకుంది. డొట్టిన్‌కు విధ్వంసకర బ్యాటర్‌గానే కాకుండా డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ బౌలర్‌గానూ పేరుంది. అందుకే డొట్టిన్‌కు వేలంలో భారీ మొత్తం దక్కింది.

ఇదిలా ఉంటే, డబ్ల్యూపీఎల్‌ మినీ వేలంలో తమిళనాడు అమ్మాయి జి కమలినిని ముంబై ఇండియన్స్‌ రూ.1.6 కోట్లకు సొంతం చేసుకుంది. నల్లపురెడ్డి చరణిని ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ. 55 లక్షలకు సొంతం చేసుకుంది. నందిని కశ్యప్‌ను ఢిల్లీ క్యాపిటల్స్‌ రూ.10 లక్షలకు సొంతం చేసుకుంది. సిమ్రన్‌ షేక్‌కు గుజరాత్‌ జెయింట్స్‌ రూ.1.9 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది. సౌతాఫ్రికాకు చెందిన నదినే డి క్లెర్క్‌ను ముంబై ఇండియన్స్‌ రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది. 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)