Breaking News

గుజరాత్‌ జెయింట్స్‌ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌

Published on Tue, 02/06/2024 - 17:09

మహిళల ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌కు (రెండవది) ముందు గుజరాత్‌ జెయింట్స్‌ కొత్త హెడ్‌ కోచ్‌ను నియమించుకుంది. ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైఖేల్‌ క్లింగర్‌ గుజరాత్‌ హెడ్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. మాజీ హెడ్‌ కోచ్‌ రేచల్‌ హేన్స్‌ స్థానాన్ని క్లింగర్‌ భర్తీ చేస్తాడు. క్లింగర్‌ ఎంపిక విషయాన్ని గుజరాత్‌ జెయింట్స్‌ మేనేజ్‌మెంట్‌ ఇవాళ (ఫిబ్రవరి 6) అధికారికంగా ప్రకటించింది.

తొలి సీజన్‌ నుంచి జెయింట్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న క్లింగర్‌ .. మెంటార్‌ మిథాలీ రాజ్‌, బౌలింగ్‌ కోచ్‌ నూషిన్‌ అల్‌ ఖదీర్‌తో ఇదివరకే జాయిన్‌ అయినట్లు జెయింట్స్‌ మేనేజ్‌మెంట్‌ తెలిపింది. క్లింగర్‌.. మహిళల బిగ్‌బాష్‌ లీగ్‌లో సిడ్నీ థండర్స్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా, అదే సిడ్నీ థండర్స్‌ రిక్రూటర్‌గా, 2019-2021 వరకు మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ పురుషుల జట్టు హెడ్‌ కోచ్‌గా పని చేశాడు.

43 ఏళ్ల క్లింగర్‌ 2019లో బిగ్‌బాష్‌ లీగ్‌కు రిటైర్మెంట్‌ (ఆటగాడిగా) పలికాడు. నాటి​​కి క్లింగర్‌ బీబీఎల్‌లో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. 

ఇదిలా ఉంటే, మహిళల ఐపీఎల్‌ తొలి ఎడిషన్‌లో (2023) గుజరాత్‌ జెయింట్స్‌ పేలవ ప్రదర్శన కనబర్చి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో ఈ జట్టు ఎనిమిది మ్యాచ్‌లు ఆడి కేవలం రెండింటిలో మాత్రమే గెలిచి లీగ్‌ నుంచి నిష్క్రమించింది.

గత సీజన్‌ పేలవ ప్రదర్శన కారణంగా మాజీ హెడ్‌ కోచ్‌ రేచల్‌ హేన్స్‌పై వేటు పడింది. గతేడాది ముంబై ఇండియన్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ముంబై టీమ్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించి, తొలి WPL టైటిల్‌ను ఎగరేసుకుపోయింది.

2024 సీజన్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌ ఫిబ్రవరి 23 నుంచి మొదలవుతుంది. ఈ సీజన్‌లో మ్యాచ్‌లన్నీ బెంగళూరు, న్యూఢిల్లీ వేదికలుగా జరుగనున్నాయి. తొలి మ్యాచ్‌ గతేడాది ఫైనలిస్ట్‌ల మధ్య బెంగళూరులో జరుగనుంది. గుజారత్‌ జెయింట్స్‌ తమ తొలి మ్యాచ్‌ను ఫిబ్రవరి 25న ముంబై ఇండియన్స్‌తో ఆడుతుంది. జెయింట్స్‌లో త్రిష పూజిత​, హర్లీన్‌ డియోల్‌, వేద కృష్ణమూర్తి, మేఘన సింగ్‌, మన్నత్‌ కశ్యప్‌, స్నేహ్‌ రాణా లాంటి భారతీయ స్టార్లు ఉన్నారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)