Breaking News

ఆర్సీబీ​​కి శుభవార్త

Published on Tue, 03/12/2024 - 09:16

మహిళల ఐపీఎల్‌ 2024 ఎడిషన్‌ చివరి దశకు చేరింది. గ్రూప్‌ దశలో మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇదివరకే రెండు ప్లేఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారైపోయాయి. ఇక మిగిలింది ఓ బెర్త్‌. ఈ బెర్త్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు దాదాపుగా ఖరారు చేసుకుంది. ఏదో మహాద్భతం జరిగితే తప్ప ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరదు. ఇవాళ (మార్చి 12) ముంబై ఇండయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడినా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది.

అయితే భారీ తేడాతో ఓడితే మాత్రం సమీకరణలు మారిపోతాయి. ఇవాల్టి మ్యాచ్‌లో ఆర్సీబీ ముంబై చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే  యూపీ వారియర్జ్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఆర్సీబీ తర్వాత యూపీ వారియర్జ్‌కు మాత్రమే ప్లేఆఫ్స్‌కు చేరుకునే ఛాన్స్‌ ఉందని అనుకోవడానికి వీల్లేదు. గుజరాత్‌ జెయింట్స్‌ తమ చివరాఖరి గ్రూప్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను కనీసం 57 పరుగుల తేడాతో ఓడిస్తే ఈ జట్టు కూడా ప్లేఆఫ్స్‌ బరిలో ఉంటుంది.

ఏ జట్టు అవకాశాలు ఎలా ఉన్నాయంటే..

  • ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌నూ గెలిస్తే దర్జాగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
  • ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే మాత్రం యూపీ వారియర్జ్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.
  • గుజరాత్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 57 అంతకంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడించి, ఆర్సీబీ ముంబై ఇండియన్స్‌ చేతిలో 60 కంటే ఎక్కువ పరుగుల తేడాతో ఓడితే గుజరాత్‌ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది.

ప్లేఆఫ్స్‌కు క్వాలిఫై అయ్యే మూడో జట్టు మార్చి 15న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది. తదుపరి జరుగబోయే రెండు గ్రూప్‌ మ్యాచ్‌ల ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలు నిర్దారించబడతాయి.

ప్రస్తుతానికి  రన్‌రేట్‌ ఆధారంగా ఢిల్లీ టాప్‌లో ఉంది. పాయింట్లు సమానంగా ఉన్నా ముంబై ఇండియన్స్‌ రెండో స్థానంలో నిలిచింది. ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచే జట్టుతో మార్చి 17న జరిగే అంతిమ సమరంలో అమీతుమీ తేల్చుకోనుంది. 


 

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)