WPL 2023: డబ్ల్యూపీఎల్‌ వేలానికి వేళాయె.. వివరాలివే

Published on Mon, 02/13/2023 - 05:22

ముంబై: బీసీసీఐ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 టోర్నీ క్రికెటర్ల వేలం కార్యక్రమం నేడు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్‌ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు.

మహిళా లీగ్‌ వేలం మహిళ మల్లిక సాగర్‌ నేతృత్వంలో జరగనుండటం విశేషం. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్‌ వేలం కార్యక్రమాన్ని నిర్వహించింది. మొత్తం 90 బెర్త్‌ల కోసం 409 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు.

ఇందులో భారత్‌ నుంచి 246 మంది... విదేశీ జట్ల నుంచి 163 మంది ఉన్నారు. హర్మన్‌ ప్రీత్‌ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రేణుక సింగ్, రిచా ఘోష్‌ (భారత్‌), ఎలీస్‌ పెర్రీ, బెత్‌ మూనీ, అలీసా హీలీ, మేగన్‌ షుట్‌ (ఆస్ట్రేలియా), నాట్‌ సివెర్, సోఫీ ఎకిల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌), డియాండ్ర డాటిన్‌ (వెస్టిండీస్‌) తదితరులకు భారీ మొత్తం లభించే అవకాశముంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్‌సీబీ, గుజరాత్‌ జెయింట్స్, యూపీ వారియర్జ్‌ జట్లు పాల్గొంటున్న డబ్ల్యూపీఎల్‌ మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగుతుంది.

Videos

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)