Breaking News

డబ్ల్యూపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ఇంగ్లీష్‌ క్రికెటర్‌.. 

Published on Wed, 03/08/2023 - 21:02

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా తొలి ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదైంది. గుజరాత్‌ జెయింట్స్‌ బ్యాటర్‌.. ఇంగ్లండ్‌ ప్లేయర్‌ సోఫియా డంక్లీ 18 బంతుల్లోనే అర్థశతకం మార్క్‌ను అందుకుంది. బుధవారం ఆర్‌సీబీతో మ్యాచ్‌లో డంక్లీ ఈ ఫీట్‌ అందుకుంది. తద్వారా డబ్ల్యూపీఎల్‌లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేసిన తొలి బ్యాటర్‌గా డంక్లీ రికార్డులకెక్కింది. ఓవరాల్‌గా 28 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు సిక్సర్లతో 65 పరుగులతో విధ్వంసం సృష్టించింది.

ముఖ్యంగా రేణుకా ఠాకూర్‌ వేసిన ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 14 పరుగులు రాబట్టిన డంక్లీ.. ప్రీతిబోస్‌ వేసిన ఐదో ఓవర్లో విశ్వరూపం చూపించింది. నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 22 పరుగులు పిండుకొని అర్థసెంచరీ మార్క్‌ను అందుకుంది. ఇక మహిళల టి20 క్రికెట్‌లో అత్యంత వేగంగా ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్న నాలుగో క్రికెటర్‌గా నిలిచింది. ఇక సోఫియా డంక్లీ ఇంగ్లండ్‌ తరపున 44 టి20ల్లో 652 పరుగులు, 28 మ్యాచ్‌ల్లో 746 పరుగులు, మూడు టెస్టు‍ల్లో 152 పరుగులు చేసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)