Breaking News

ఉపయోగం లేని మ్యాచ్‌.. టాప్‌ ప్లేస్‌ కోసం మాత్రమే

Published on Tue, 03/21/2023 - 15:06

వుమెన్స్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఇవాళ లీగ్‌ మ్యాచ్‌లకు ఆఖరిరోజు. నేటితో లీగ్‌ మ్యాచ్‌లు ముగియనున్న వేళ ముంబై ఇండియన్స్‌, రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఉపయోగం లేని మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ ఏంచుకుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్‌ సహా ఢిల్లీ క్యాపిటల్స్‌ వుమెన్‌, యూపీ వారియర్జ్‌లు ప్లేఆఫ్‌కు క్వాలిఫై కాగా.. ఆర్‌సీబీ, గుజరాత్‌లు ఎలిమినేట్‌ అయ్యాయి.

ఈ మ్యాచ్‌లో గెలిచి ముంబై టాప్‌ ప్లేస్‌ను సుస్థిరం చేసుకోవాలని భావిస్తుండగా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన ఆర్‌సీబీ హ్యాట్రిక్‌ విజయంపై కన్నేసింది. గత మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ను 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించిన ఆర్‌సీబీ ముంబైతో మ్యాచ్‌లోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని చూస్తోంది. ముఖ్యంగా గుజరాత్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లో 99 పరుగులు విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన సోఫీ డివైన్‌పై మరోసారి దృష్టి నెలకొంది.

మరోవైపు ముంబై ఇండియన్స్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించి టాప్‌ప్లేస్‌తో లీగ్‌ దశను ముగియాలని చూస్తుంది.  ఇక తొలి రౌండ్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

ముంబై ఇండియన్స్‌ వుమెన్‌: యస్తికా భాటియా (వికెట్‌ కీపర్‌), హేలీ మాథ్యూస్, నటాలీ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్‌), అమేలియా కెర్, పూజా వస్త్రాకర్, ఇస్సీ వాంగ్, అమంజోత్ కౌర్, హుమైరా కాజీ, జింటిమణి కలితా, సైకా ఇషాక్.

ఆర్‌సీబీ వుమెన్‌: స్మృతి మంధాన (కెప్టెన్‌), సోఫీ డివైన్, ఎల్లీస్ పెర్రీ, హీథర్ నైట్, కనికా అహుజా, రిచా ఘోష్ (వికెట్‌ కీపర్‌), శ్రేయాంక పాటిల్, దిశా కసత్, ఆశా శోభన, మేగన్ షుట్, ప్రీతి బోస్

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)