Breaking News

WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్‌ సంచలనం.. ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా! పాపం ముంబై!

Published on Wed, 03/22/2023 - 09:58

WPL 2023- Delhi Capitals In Finals- ముంబై: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్‌ టోర్నీలో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారంతో లీగ్‌ దశ మ్యాచ్‌లు ముగిశాయి. చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌ల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఐదు వికెట్ల తేడాతో యూపీ వారియర్స్‌ను ఓడించగా... ముంబై ఇండియన్స్‌ నాలుగు వికెట్లతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుపై గెలిచింది.

పాపం ముంబై.. మరో మ్యాచ్‌లో
ఢిల్లీ, ముంబై 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్‌రేట్‌ ఆధారంగా ఢిల్లీ (1.856) ‘టాపర్‌’గా నిలిచి ఫైనల్‌ చేరింది. మరో ఫైనల్‌ బెర్త్‌ కోసం శుక్రవారం జరిగే ఏకైక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌తో ముంబై తలపడుతుంది. 

ఢిల్లీతో మ్యాచ్‌లో తొలుత యూపీ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. తాలియా (58 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేసింది. ఢిల్లీ బౌలర్లలో అలైస్‌ క్యాప్సీ (3/26) ఆకట్టుకుంది. ఢిల్లీ 17.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది.

ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ క్యాప్సీ
క్యాప్సీ (34; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మరిజాన్‌ కాప్‌ (34 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), లానింగ్‌ (23 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) నిలకడగా ఆడి ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించారు. ముంబై తో మ్యాచ్‌లో తొలుత బెంగళూరు 9 వికెట్లకు 125 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో అమె లియా కెర్‌ (3/22) రాణించింది. ముంబై 16.3 ఓవర్లలో 6 వికెట్లకు 129 పరుగులు చేసి గెలిచింది. అమెలియా కెర్‌ (31 నాటౌట్‌; 4 ఫోర్లు), యస్తిక (30; 6 ఫోర్లు) దూకుడుగా ఆడారు.  

చదవండి: Ind Vs Aus 3rd ODI: అతడికి విశ్రాంతి? సుందర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌కు ఛాన్స్‌!
SA Vs WI: క్లాసెన్‌ విశ్వరూపం; 29 ఓవర్లలోనే టార్గెట్‌ను ఊదేశారు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)