Breaking News

అతడు 12 కోట్లకే దొరికేవాడు.. ఇషాన్‌ కూడా చీప్‌.. అయినా ఎందుకిలా?

Published on Thu, 11/28/2024 - 12:40

ఐపీఎల్‌ మెగా వేలం-2025లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌) ఫ్రాంఛైజీ అనుసరించిన వ్యూహం తనకు ఆశ్చర్యం కలిగించిందని టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నాడు. వెంకటేశ్‌ అయ్యర్‌ కోసం ఏకంగా రూ. 23.75 కోట్లు ఖర్చు చేయడం ఏమిటని ప్రశ్నించాడు. అతడి కంటే ఇషాన్‌ కిషన్‌ తక్కువ ధరకు వచ్చేవాడని.. అయినప్పటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు చేయలేదని కేకేఆర్‌ నిర్ణయాలను విమర్శించాడు.

మూడో ఆటగాడిగా
సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో నవంబరు 24, 25 తేదీల్లో మెగా వేలం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదటిరోజే వెంకటేశ్‌ అయ్యర్‌ కోసం కేకేఆర్‌ కళ్లు చెదిరే మొత్తం ఖర్చు చేసింది. ఫలితంగా క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో అత్యంత ఎక్కువ ధరకు అమ్ముడుపోయిన మూడో ఆటగాడిగా వెంకటేశ్‌ నిలిచాడు.

ఈ నేపథ్యంలో కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా మాట్లాడుతూ.. ‘‘వేలానికి ముందు ఇద్దరు అయ్యర్ల(శ్రేయస్‌, వెంకటేశ్‌)ను కేకేఆర్‌ రిటైన్‌ చేసుకోలేకపోయింది. వారి డిమాండ్‌ను బట్టి వేలంలో ఒక్కరినే దక్కించుకోలగలదని తెలుసు. అయితే, వాళ్లకు ఇప్పుడు కెప్టెన్‌ అవసరం ఉంది. అయినప్పటికీ వెంకీ కోసం వాళ్లు భారీగా ఖర్చు పెట్టారు.

ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు
ఒక్క ఆటగాడి కోసమే రూ. 23.75 కోట్లు వెచ్చించారు. కెప్టెన్‌ ఆప్షన్‌ లేదంటే.. ప్రత్యేక నైపుణ్యాలున్న ఆటగాడి కోసం ఎవరైనా ఇంత భారీగా ఖర్చు చేయొచ్చు. కానీ.. ఇందులో వెంకీ రెండింటికీ సరిపోడు. విశ్వాసపాత్రులుగా ఉండటం చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారం అంటారు.

అతడు 12 కోట్లకే వచ్చేవాడు.. ఇషాన్‌ కూడా చీప్‌ 
ఇక్కడ అది నిజమే అనిపిస్తోంది. ఒక్కడి కోసం ఇంత మొత్తం పెట్టినపుడు.. ఏదో ఒక విషయంలో మీరు కాంప్రమైజ్‌ కావాల్సి వస్తుంది. ఇక్కడ అదే జరిగింది. మీకు ఓపెనర్‌ కావాలని అనుకుంటే... ఫిల్‌ సాల్ట్‌(ఆర్సీబీ) కోసం పోటీపడి రూ. 12 కోట్లకు సొంతం చేసుకోవాల్సింది. లేదంటే కేఎల్‌ రాహుల్‌(ఢిల్లీ) కోసం రూ. 14 కోట్లకు పైగా వెచ్చించాల్సింది. అదీ కాకపోతే ఇషాన్‌ కిషన్‌(సన్‌రైజర్స్‌) కూడా తక్కువ ధరకు అందుబాటులో ఉన్నాడు.

అతడు కూడా మంచి ఓపెనర్‌. అయినప్పటికీ మీరెందుకు వెంకటేశ్‌ కోసం రూ. 20 కోట్లకు పైగా ఎందుకు ఖర్చు చేశారో అర్థం కావడం లేదు’’ అని చోప్రా కేకేఆర్‌ వ్యూహాలను విమర్శించాడు. కాగా వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌. అతడు పేస్‌ బౌలింగ్‌ కూడా చేయగలడు. 

కానీ అతడి బౌలింగ్‌ గణాంకాలు మాత్రం అంతంతమాత్రమే. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో మొత్తంగా 50 మ్యాచ్‌లు ఆడిన వెంకటేశ్‌ అయ్యర్‌ 1326 పరుగులు చేయడంతో పాటు.. మూడు వికెట్లు తీయగలిగాడు.

కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో
ఐపీఎల్‌-2024లో కేకేఆర్‌ను చాంపియన్‌గా నిలపడంలో వెంకటేశ్‌ అయ్యర్‌ది కీలక పాత్ర. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్లో 26 బంతుల్లోనే 52 పరుగులతో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌(6*)తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. 

అయితే, వేలానికి ముందు కేకేఆర్‌ వీరిద్దరిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దీంతో వెంకీని తిరిగి దక్కించుకునే అవకాశం రాగా.. శ్రేయస్‌ అయ్యర్‌ను రూ. 26.75 కోట్లకు పంజాబ్‌ కింగ్స్‌ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024లో వెంకటేశ్‌ అయ్యర్‌ 13 ఇన్నింగ్స్‌లో కేవలం 370 రన్స్‌ చేశాడు.

చదవండి: వేలం ముగిసింది.. ఇక మిగిలింది అదే!.. ఏ జట్టులో ఎవరు? ఎవరి పర్సులో ఎంత? ఎన్ని ఖాళీలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)