ఐపీఎల్‌లో హీరో.. అక్కడ మాత్రం జీరో

Published on Fri, 07/10/2026 - 18:10

యూకే పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షార్పణం కాగా, తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలై సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించింది.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా విజయవంతమైన శ్రేయస్ అయ్యర్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తొలి విజయం కోసం అతడు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓటమి పాలై రెండు సిరీస్‌లను కోల్పోయింది.

ఇక యూకే టూర్‌లో భారత బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమైంది. కెప్టెన్ శ్రేయస్, అభిషేక్ శర్మ మినహా మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు. టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూ శాంసన్ కూడా ఈ పర్యటనలో నిరాశపరిచాడు.

మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం కావడంతో సంజూను తుది జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశమిచ్చారు. కానీ భారీ అంచనాలతో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలు పెట్టిన వైభవ్‌.. తన మొదటి మూడు మ్యాచ్‌లలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మూడు మ్యాచ్‌లు కలిపి కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు.

కిషన్‌కు ఏమైంది?
మరోవైపు వరల్డ్ నంబర్ టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్‌లో దుమ్ములేపిన కిషన్‌.. ఆ ఫామ్‌ను యూకే పర్యటనలో మాత్రం కొనసాగించలేకపోయాడు. ఒకేరకమైన బంతులకు పదే పదే అవుట్ అవుతూ నిరాశపరుస్తున్నాడు. 

గత 6 ఇన్నింగ్స్‌ల్లో ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని యావరేజ్ 13.2 కాగా, స్ట్రైక్ రేట్ 108.2 మాత్రమే. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీల గురించిన చర్చల నడుమ.. కిషన్ వైఫల్యాలు అంతగా హైలెట్ కాలేదు.

కానీ కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి తన చెత్త ప్రదర్శనతో కిషన్ భారత ఓటమికి ఓ కారణమయ్యాడు. వైస్ కెప్టెన్ తిల‌క్ వ‌ర్మ కూడా ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాడు. త‌న స్లో బ్యాటింగ్‌తో మాజీ క్రికెట‌ర్ల‌కు టార్గెట్ అవుతున్నాడు.

కాగా భారత్‌లో ఫ్లాట్ పిచ్‌లకు అలవాటు పడడం కారణంగానే విదేశీ పరిస్థితులపై మన బ్యాటర్ల రాణించలేకపోతున్నారన్న విమర్శలు వస్తుస్తున్నాయి. ఇంగ్లండ్ పిచ్‌లపై ఉండే అదనపు బౌన్స్, మూవ్‌మెంట్‌ను అంచనా వేయడంలో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు.

తొలి టీ20 నుంచే షార్ట్ పిచ్ బంతులకు వికెట్లు సమర్పించుకుంటున్నారు. కనీసం చివరి టీ20లోనైనా గెలిచి పరువు కాపాడుకుంటారో లేదో చూడాలి. ఐదో టీ20 శనివారం సౌతాంప్టన్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. 
 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)