Breaking News

వరుణుడి ఖాతాలో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌.. టాస్‌ కూడా పడకుండానే రద్దు

Published on Fri, 09/29/2023 - 16:20

వన్డే ప్రపంచకప్‌ 2023లో వరుణుడు బోణీ కొట్టాడు. తిరువనంతపురం వేదికగా సౌతాఫ్రికా-ఆఫ్ఘనిస్తాన్‌ జట్ల మధ్య ఇవాళ (సెప్టెంబర్‌ 29) జరగాల్సిన వరల్డ్‌కప్‌ వార్మప్‌ మ్యాచ్‌ వర్షం​ కారణంగా టాస్‌ కూడా పడకుండానే రద్దైంది. తిరువనంతపురంలో ఇవాల్టి ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో అంపైర్లు తప్పనిసరి పరిస్థితుల్లో మ్యాచ్‌ను రద్దు చేశారు. మైదానం చిన్న సైజు​ చెరువులా మారడంతో అంపైర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. 

ఇదిలా ఉంటే, వ్యక్తిగత కారణాల చేత సౌతాఫ్రికా కెప్టెన్‌ టెంబా బవుమా స్వదేశానికి తిరిగి వెళ్లడంతో వార్మప్‌ మ్యాచ్‌లకు ఎయిడెన్‌ మార్క్రమ్‌ నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్న విషయం తెలిసిందే. బవుమా వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్‌ సమయానికంతా జట్టుతో చేరతాడని సమాచారం. సౌతాఫ్రికా తమ వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 7న ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో సఫారీలు శ్రీలంకను ఢీకొంటారు.

దీనికి ముందు ఆ జట్టు మరో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడనుంది. అక్టోబర్‌ 2న సఫారీలు ఇదే తిరువనంతపురంలో న్యూజిలాండ్‌ను ఎదుర్కొంటారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్‌ వరల్డ్‌కప్‌లో తమ తొలి మ్యాచ్‌ను అక్టోబర్‌ 7న ఆడనుంది. ధర్మశాలలో జరిగే ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘన్లు.. బంగ్లాదేశ్‌ను ఢీకొంటారు. దీనికి ముందు ఆఫ్ఘన్‌ టీమ్‌ మరో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అక్టోబర్‌ 3న వీరు గౌహతిలో శ్రీలంకను ఢీకొంటారు.

ఇదిలా ఉంటే, ఇవాళే మరో రెండు వార్మప్‌ మ్యాచ్‌లు కూడా జరుగుతున్న విషయం తెలిసిం‍దే. హైదరాబాద్‌లో పాకిస్తాన్‌-న్యూజిలాండ్‌.. గౌహతిలో శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్లు తలపడుతున్నాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పాక్‌ 21 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 99 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బాబర్‌ ఆజమ్‌ (41), మొహమ్మద్‌ రిజ్వాన్‌ (34) క్రీజ్‌లో ఉన్నారు. 

బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంక.. 28 ఓవర్ల తర్వాత 3 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. అసలంక (18), ధనంజయ డిసిల్వ (17) క్రీజ్‌లో ఉన్నారు.

Videos

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)