Breaking News

వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టు.. ఎవరూ ఊహించని ఆటగాడు ఎంట్రీ!

Published on Sat, 08/19/2023 - 09:28

టీమిండియా స్పీడ్‌ స్టార్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ అంతర్జాతీయ టీ20ల్లో కూడా తన అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. ఇప్పటికే వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన ఈ కర్ణాటక పేసర్‌... ఐర్లాండ్‌తో తొలి టీ20తో పొట్టి క్రికెట్‌లో డెబ్యూ చేశాడు. తన తొలి మ్యాచ్‌లో రెండు వికెట్లు పడగొట్టి అందరని ప్రసిద్ధ్‌ అకట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన ప్రసిద్ధ్‌.. 32 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు.

తన తొలి ఓవర్‌లో టెక్టర్‌ను ఔట్‌ చేసిన ప్రసిద్ద్‌, రెండో ఓవర్‌లో డాక్రెల్‌ను పెవిలియన్‌కు పంపాడు. కాగా గత కాలంగా వెన్ను గాయంతో ప్రసిద్ధ్‌ కృష్ణ జట్టుకు దూరంగా ఉంటున్నాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‌కు కూడా దూరమయ్యాడు. అతడు ఈ మ్యాచ్‌కు దాదాపు ఏడాది పాటు జాతీయ జట్టుకు కూడా దూరంగా ఉన్నాడు.

ఇక గాయం నుంచి కోలుకుని వచ్చిన వెంటనే అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన ప్రసిద్ధ్‌ కృష్ణపై మాజీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న ఆసియాకప్‌, వన్డే ప్రపంచకప్‌లకు బుమ్రా, సిరాజ్‌, షమీలతో పాటు అదనపు పేసర్‌గా ప్రసిద్ధ్‌ కృష్ణను కూడా ఎంపిక చేయాలని చాలా మంది సూచిస్తున్నారు. ​కాగా 27 ఏళ్ల ప్రసిద్ద్‌కు వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు భారత తరపున 14 మ్యాచ్‌లు ఆడిన కృష్ణ.. 5.32 ఏకానమీతో 25 వికెట్టు పడగొట్టాడు.

ఈ క్రమంలోనే అతడిని ఈ మెగా టోర్నీలకు ఎంపిక చేయాలని అభిప్రాయపడుతున్నారు. అదే విధంగా మరోస్టార్‌ పేసర్‌ సిరాజ్‌ ప్రస్తుతం కాలి మడమ గాయంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. విండీస్‌ పర్యటనకు వెళ్లిన సిరాజ్‌ మధ్యలోనే అక్కడ నుంచి స్వదేశానికి వచ్చాడు. అతడి ఫిట్‌నెస్‌పై ఇప్పటివరకు అయితే ఎటువంటి అప్‌డేట్‌ లేదు. సిరాజ్‌కు ప్రత్నమ్నాయంగా  ప్రసిద్ధ్‌ను తీసుకునే ఛాన్స్‌ ఉం‍ది.
చదవండి: చాలా సంతోషంగా ఉంది.. క్రెడిట్‌ మొత్తం వాళ్లకే! ఇంకా మెరుగవ్వాలి: భారత కెప్టెన్‌

Videos

ఎవరికీ పోస్టు ఇవ్వాలో మంగళగిరి నుంచి ఫోన్.. లైవ్ వీడియో ప్లే చేసి ఏకిపారేసిన జగన్

బాబు జైలుకెళ్లి మూడేళ్లు... వెళ్తూ వెళ్తూ జగన్ సెటైర్లు అదుర్స్

ఉక్రెయిన్ ఖజానా ఖాళీ... యుద్ధంతో దివాలా దిశగా..!

అరుదైన కోతులు.. ఇక్కడికి ఎలా వచ్చాయి! వీటి ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

ఐఫోన్ 18 వచ్చేసింది.. ఫీచర్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే

దద్దరిల్లిన కర్నూలు మెగా పోలీస్ నోటిఫికేషన్.. రోడ్డెక్కిన యువత

Gold: మళ్లీ పెరిగిన బంగారం తులం ఎంతంటే..?

15లక్షలకు DSC జాబ్ లు అమ్ముకున్నారు..! సంచలన వీడియో బయటపెట్టిన YS జగన్

DSC స్కాంలో కీలక పాత్ర ఎంపీ భరత్ ది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

DSC స్కాం పార్ట్ 2.. వెలుగులోకి కీలక ఆధారాలు

Photos

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)