Breaking News

టీ20 వరల్డ్‌కప్‌ 2024.. భారత్‌ సెమీస్‌కు చేరాలంటే ఇలా జరగాలి..!

Published on Sat, 10/12/2024 - 16:50

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో గ్రూప్-ఏ మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి ఆస్ట్రేలియా సెమీస్‌ బెర్త్‌ను దాదాపుగా ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్‌ కోసం భారత్‌, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌ మధ్య పోటీ నెలకొంది. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన శ్రీలంక టోర్నీ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది.

గ్రూప్-ఏ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి సెమీస్‌ బెర్త్‌ను అనధికారికంగా ఖరారు చేసుకుంది. భారత్‌ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌లో గెలిచి మూడో స్థానంలో ఉంది.  పాక్‌ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్‌ గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది.

భారత్‌ సెమీస్‌కు చేరాలంటే..?
గ్రూప్‌ మ్యాచ్‌లన్నీ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉండే జట్లు సెమీస్‌కు చేరతాయి. ప్రస్తుత సమీకరణల ప్రకారం ఆసీస్‌ మొదటి స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరడం ఖాయంగా కనిపిస్తుంది. భారత్‌ సెమీస్‌ చేరాలంటే ఆదివారం (అక్టోబర్‌ 13) ఆస్ట్రేలియాతో జరుగబోయే మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ భారీ తేడాతో గెలిస్తే ఎలాంటి అవాంతరాలు లేకుండా సెమీస్‌కు చేరుకుంటుంది.

ఒకవేళ ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆసీస్‌ చేతిలో ఓడితే.. న్యూజిలాండ్‌ ఆడబోయే మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. భారత్ సెమీస్ చేరాలంటే కివీస్ తమ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలవ్వాలి. లేదంటే కనీసం ఒక్క దాంట్లోనైనా చిత్తుగా ఓడాలి. అప్పుడు భారత్‌ మెరుగైన రన్‌రేట్‌తో సెమీస్‌కు చేరుకుంటుంది.

ఒకవేళ కివీస్‌.. శ్రీలంక, పాకిస్తాన్‌లపై గెలిచి, భారత్‌.. ఆసీస్‌ చేతిలో ఓడిందంటే అప్పుడు కివీసే సెమీస్‌కు చేరుకుంటుంది. ఇక్కడ పాకిస్తాన్‌ సెమీస్‌ చేరే అవకాశాలను సైతం కొట్టి పారేయడానికి వీల్లేదు. పాక్‌ తమ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారీ తేడాతో గెలిచి.. భారత్‌ ఆస్ట్రేలియా చేతిలో, న్యూజిలాండ్‌ శ్రీలంక చేతిలో ఓడితే పాక్‌ సెమీస్‌కు చేరుకుంటుంది. 

చదవండి: IND VS BAN: మూడో టీ20కి వర్షం​ ముప్పు..?

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)