T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించిన ఆస్ట్రేలియా

Published on Wed, 10/09/2024 - 14:29

మహిళల టీ20 వరల్డ్‌కప్‌-2024లో ఆస్ట్రేలియా వరుస విజయాలతో దూసుకుపోతుంది. న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్‌ 8) జరిగిన మ్యాచ్‌లో 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. బెత్‌ మూనీ (40), ఎల్లిస్‌ పెర్రీ (30), అలైసా హీలీ (26) ఓ మోస్తరు స్కోర్లతో రాణించారు. కివీస్‌ బౌలర్లలో అమేలియా కెర్‌ నాలుగు వికెట్లతో సత్తా చాటింది. బ్రూక్‌ హ్యలీడే, రోస్‌మేరీ మెయిర్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

అనంతరం 149 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌.. ఆసీస్‌ బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 88 పరుగులకే కుప్పకూలింది. మెగాన్‌ షట్‌, సదర్‌ల్యాండ్‌ తలో మూడు వికెట్లు తీసి కివీస్‌ను దెబ్బకొట్టారు. సోఫీ మోలినెక్స్‌ రెండు, జార్జియా వేర్హమ్‌, తహిళ మెక్‌గ్రాత్‌ తలో వికెట్‌ పడగొట్టారు. కివీస్‌ ఇన్నింగ్స్‌లో జార్జియా ప్లిమ్మర్‌ (29), సుజీ బేట్స్‌ (20), లియా తహుహు (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఈ గెలుపుతో ఆసీస్‌ గ్రూప్‌-ఏలో (పాయింట్ల పట్టిక) అగ్రస్థానానికి చేరింది. పాక్‌, న్యూజిలాండ్‌, భారత్‌, శ్రీలంక ఆతర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 

చదవండి: జో రూట్‌ సరికొత్త చరిత్ర.. తొలి ఇంగ్లండ్‌ క్రికెటర్‌గా

Videos

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)