Breaking News

మహిళల లీగ్‌కు మోగిన నగారా! 

Published on Sat, 03/04/2023 - 01:12

ముంబై: ఎన్నాళ్లుగానో వేచిన క్షణం రానే వచ్చింది... భారత మహిళల క్రికెట్‌లోనూ ఐపీఎల్‌ లాంటి టోర్నీ ఉండాలని, అమ్మాయిలకు మరిన్ని అవకాశాలు రావాలని ఏళ్లుగా సాగిన చర్చ ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తోంది. అసలు మహిళల లీగ్‌ ఉంటుందా, ఉండదా, వాణిజ్యపరంగా సఫలం అవుతుందా అనే సందేహాలు... నిర్వహణపై ఏనాడూ స్పష్టత లేని స్థితి... ఇప్పుడు ఇవన్నీ గతం... ఎట్టకేలకు బీసీసీఐ చొరవతో ఇప్పుడు అన్ని అడ్డంకులను దాటి... అదీ ఐపీఎల్‌ తరహా యాజమాన్యాల అండతో తొలి మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) సన్నద్ధమైంది. నేడు రాత్రి గం. 7:30 నుంచి జరిగే తొలి మ్యాచ్‌తో లీగ్‌కు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో డబ్ల్యూపీఎల్‌ విశేషాలు... 


బరిలో ఉన్న జట్లు (5)
కెప్టెన్‌లు: (రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు–స్మృతి మంధాన; ముంబై  ఇండియన్స్‌–హర్మన్‌ప్రీత్‌ కౌర్‌; ఢిల్లీ క్యాపిటల్స్‌–మెగ్‌ లానింగ్‌; యూపీ వారియర్స్‌–అలీసా హీలీ; గుజరాత్‌ జెయింట్స్‌–బెత్‌ మూనీ). 
వేదికలు: 2 (ముంబైలోనే; బ్రబోర్న్‌ స్టేడియం,  డీవై పాటిల్‌ స్టేడియం) 
మొత్తం మ్యాచ్‌లు: 22 (20 లీగ్‌ మ్యాచ్‌లతో పాటు ఒక ఎలిమినేటర్, ఫైనల్‌) 
ఫార్మాట్‌: ప్రతీ టీమ్‌ ఇతర నాలుగు జట్లతో రెండేసి మ్యాచ్‌లు (మొత్తం 8) ఆడుతుంది. టాప్‌గా  నిలిచిన టీమ్‌ నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. తర్వాతి రెండు టీమ్‌ల మధ్య ‘ఎలిమినేటర్‌’ మ్యాచ్‌ విజేత రెండో ఫైనలిస్ట్‌ అవుతుంది.  
తుది జట్టులో విదేశీ ఆటగాళ్ల సంఖ్య: 4  
మ్యాచ్‌ సమయం: ఐపీఎల్‌లాగే ఒక మ్యాచ్‌ ఉంటే రాత్రి గం 7:30 నుంచి... రెండు మ్యాచ్‌లు ఉన్న రోజు తొలి మ్యాచ్‌ గం. 3:30 నుంచి... రెండో మ్యాచ్‌ రాత్రి గం. 7:30 నుంచి 
డీఆర్‌ఎస్‌: అందుబాటులో ఉంది. ఒక్కో ఇన్నింగ్స్‌లో జట్టుకు రెండు అవకాశాలు ఉంటాయి.   
లీగ్‌లో ఉన్న తెలుగు అమ్మాయిల సంఖ్య: 6 (స్నేహదీప్తి, అంజలి శర్వాణి, సబ్బినేని మేఘన, షబ్నమ్‌ (ఆంధ్రప్రదేశ్‌) అరుంధతి రెడ్డి, యషశ్రీ (హైదరాబాద్‌). 
 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)