వెస్టిండీస్‌కు గుండె కోత.. 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించినా..!

Published on Sat, 04/19/2025 - 21:47

మహిళల వన్డే ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌లో వెస్టిండీస్‌కు గుండె కోత మిగిలింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో గెలిచినా కరీబియన్‌ జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది. థాయ్‌లాండ్‌తో ఇవాళ (ఏప్రిల్‌ 19) జరిగిన డు ఆర్‌ డై మ్యాచ్‌లో వెస్టిండీస్‌ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన థాయ్‌లాండ్‌ 46.1 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్‌ కాగా.. వెస్టిండీస్‌ కేవలం 10.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. అయినా 0.013 రన్‌రేట్‌ తేడాతో వరల్డ్‌కప్‌ బెర్త్‌ను కోల్పోయింది. 

పాయింట్ల పరంగా విండీస్‌తో సమానంగా ఉన్నప్పటికీ.. రన్‌రేట్‌ కాస్త ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్‌ ప్రపంచకప్‌ బెర్త్‌ను దక్కించుకుంది. ఈ టోర్నీలో పాక్‌ ఆడిన 5 మ్యాచ్‌ల్లో గెలిచి తొలి ప్రపంచకప్‌ బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. రెండో బెర్త్‌ కోసం వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ పోటీపడ్డాయి. ఇరు జట్లు చెరో 5 ​మ్యాచ్‌ల్లో తలో మూడు గెలువగా, రన్‌రేట్‌ కాస్త ఎక్కువగా ఉండటం చేత బంగ్లాదేశ్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించింది.

కాగా, పాక్‌ వేదికగా జరిగిన మహిళల వన్డే వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్‌-2025లో మొత్తం ఆరు జట్లు (పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, థాయ్‌లాండ్‌) పాల్గొన్నాయి. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పాక్‌, బంగ్లాదేశ్‌ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా మహిళల వన్డే వరల్డ్‌కప్‌ జరుగనుంది. ఈ టోర్నీకి భారత్‌ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, న్యూజిలాండ్‌ నేరుగా అర్హత సాధించగా.. పాక్‌, బంగ్లాదేశ్‌ క్వాలిఫయర్స్‌ ద్వారా క్వాలిఫై అయ్యాయి.‌ 

Videos

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)