Breaking News

Women's T20 World Cup 2024: ఇదిగో మన బలగం..!

Published on Wed, 08/28/2024 - 11:43

సాక్షి క్రీడా విభాగం: గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత మహిళల క్రికెట్‌ జట్టు... అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) టోర్నీల్లో మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. మెగా టోర్నీల్లో మంచి ఆరంభాలు లభించినా... చివరి దశకు వచ్చేసరికి ఒత్తిడిని తట్టుకోలేక రిక్తహస్తాలతో వెనుదిరుగుతోంది. ఆ అడ్డంకిని అధిగమించి ముందడుగు వేసి ప్రపంచ చాంపియన్‌గా అవతరించేందుకు మన మహిళల జట్టుకు మరో అవకాశం వచ్చింది. అక్టోబర్‌ 3 నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా మహిళల టి20 ప్రపంచకప్‌ జరగనుంది. 

ఈ టోర్నీ కోసం భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యం వహించనున్న ఈ జట్టులో అనుభవానికి, యువతరానికి సమాన ప్రాధాన్యత కల్పించారు. పురుషుల జట్టు సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ... ఇటీవల టి20 ప్రపంచకప్‌ సాధించగా... ఇప్పుడదే బాటలో మహిళల జట్టు కూడా జగజ్జేతగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. 

మెగా టోర్నీకి ఎంపిక చేసిన మన ప్లేయర్ల బలాబలాలను ఒకసారి పరిశీలిస్తే... అంతర్జాతీయ టి20ల్లో 173 మ్యాచ్‌లు ఆడిన కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ అందరికంటే సీనియర్‌ కాగా.. వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న స్మృతి మంధాన 141 మ్యాచ్‌ల్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. వీరిద్దరి తర్వాత స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ 117 మ్యాచ్‌లు ఆడగా.. జెమీమా రోడ్రిగ్స్‌ 100 మ్యాచ్‌లు ఆడింది. 

ఇక అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు విజేతగా నిలవడంలో ప్రధాన పాత్ర పోషించిన విధ్వంసక ఓపెనర్‌ షఫాలీ వర్మతో పాటు వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌ కూడా కీలకం కానున్నారు. మొత్తం 10 జట్లు పాల్గొంటున్న ప్రపంచకప్‌లో... ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, పాకిస్తాన్‌, శ్రీలంకతో కలిసి భారత్‌ గ్రూప్‌ ‘బి’ నుంచి పోటీ పడనుంది. మెగా టోర్నీలో భాగంగా అక్టోబర్‌ 4న న్యూజిలాండ్‌తో హర్మన్‌ బృందం తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 

అనంతరం అక్టోబర్‌ 6న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో ఆడుతుంది. జట్టులో స్పిన్నర్లకు కొదవ లేకున్నా... పేస్‌ ఆల్‌రౌండర్ల లోటు కనిపిస్తోంది. శ్రేయంక పాటిల్‌, యస్తికా భాటియాను ఎంపిక చేసినా... గాయాల నుంచి పూర్తిగా కోలుకుంటేనే వీరిద్దరు జట్టుతో కలిసి యూఏఈ బయలుదేరుతారు. ఇక ట్రావెల్‌ రిజర్వ్‌లుగా తనూజ కన్వర్‌, ఉమా ఛెత్రీ, సైమా ఠాకూర్‌ ఎంపికయ్యారు. 
----
హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (కెప్టెన్‌)
మ్యాచ్‌లు    173
పరుగులు    3426
అత్యధిక స్కోరు    103
సగటు    28.08
సెంచరీలు    1
అర్ధ సెంచరీలు    12
వికెట్లు    32
---
స్మృతి మంధాన (వైస్‌ కెప్టెన్‌)
మ్యాచ్‌లు    141
పరుగులు    3493
అత్యధిక స్కోరు    87
సగటు    28.86
అర్ధ సెంచరీలు    26
---
షఫాలీ వర్మ
మ్యాచ్‌లు 81
పరుగులు    1948
అత్యధిక స్కోరు    81
సగటు    25.63
అర్ధ సెంచరీలు    10
---
యస్తికా భాటియా
మ్యాచ్‌లు    19
పరుగులు    214
అత్యధిక స్కోరు    36
సగటు    16.46
---
దీప్తి శర్మ
మ్యాచ్‌లు    117
పరుగులు    1020
అత్యధిక స్కోరు    64
సగటు    23.72
అర్ధ సెంచరీలు    2
వికెట్లు 131
---
జెమీమా రోడ్రిగ్స్‌
మ్యాచ్‌లు    100
పరుగులు    2074
అత్యధిక స్కోరు 76
సగటు    30.50
అర్ధ సెంచరీలు    11
---
రిచా ఘోష్‌
మ్యాచ్‌లు    55
పరుగులు    860
అత్యధిక స్కోరు 64*
సగటు     28.66
అర్ధ సెంచరీలు    1
---
పూజ వస్త్రకర్‌
మ్యాచ్‌లు    70
వికెట్లు    57
అత్యుత్తమ ప్రదర్శన    4/13
సగటు    21.24
ఎకానమీ 6.36
---
అరుంధతి రెడ్డి
మ్యాచ్‌లు    29
వికెట్లు    21
అత్యుత్తమ ప్రదర్శన    2/19
సగటు    34.66
ఎకానమీ    7.92
---
రేణుక సింగ్‌
మ్యాచ్‌లు    47
వికెట్లు    50
అత్యుత్తమ ప్రదర్శన    5/15
సగటు    22.02
ఎకానమీ    6.40
---
హేమలత
మ్యాచ్‌లు    23
పరుగులు    276
అత్యధిక స్కోరు    47
సగటు    16.23
వికెట్లు    9
---
ఆశా శోభన
మ్యాచ్‌లు    3
వికెట్లు    4
ఉత్తమ ప్రదర్శన    2/18
సగటు    20.50
ఎకానమీ    7.45
---
రాధ యాదవ్‌
మ్యాచ్‌లు    80
వికెట్లు    90
ఉత్తమ ప్రదర్శన    4/23
సగటు    19.62
ఎకానమీ    6.55
---
శ్రేయాంక పాటిల్‌
మ్యాచ్‌లు    12
వికెట్లు    16
ఉత్తమ ప్రదర్శన    3/19
సగటు    18.75
ఎకానమీ    7.14
---
సజన సజీవన్‌
మ్యాచ్‌లు    9
పరుగులు    30
అత్యధిక స్కోరు 11
సగటు    10.00

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)