పురుషులే అనుకున్నాం.. మహిళా క్రికెటర్లది అదే తీరు!

Published on Sun, 02/19/2023 - 22:22

పాకిస్తాన్‌ క్రికెట్‌ నిలకడలేమికి మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి తెలియదు. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం.. ఓడిపోవాల్సిన ‍మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సాధించడం వారికి అలవాటే. అయితే ఇలాంటివి పురుషుల క్రికెట్‌లో బాగా చూస్తుంటాం. తాజాగా పాకిస్తాన్‌ మహిళల జట్టు కూడా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయింది.

అది కూడా మహిళల టి20 వరల్డ్‌కప్‌లో కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఓడిపోయి సెమీస్‌ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. గ్రూప్‌-బిలో భాగంగా ఆదివారం పాకిస్తాన్‌, వెస్టిండీస్‌ వుమెన్స్‌ మధ్య లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్‌ వుమెన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 116 పరుగులు చేసింది. రష్దా విలియమ్స్‌ 30 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచింది. మిగతావారిలో క్యాంప్‌బెల్లె 23 పరుగులు, హేలీ మాథ్యూస్‌ 20 పరుగులు చేసింది. 

అనంతరం 117 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 113 పరుగులకే పరిమితమై మూడు పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పాక్‌ బ్యాటర్లలో అలియా రియాజ్‌ 29 పరుగులు, నిదా దార్‌ 27 పరుగులు, బిస్మా మరుఫ్‌ 26 పరుగులు చేశారు. విండీస్‌ వుమెన్స్‌ బౌలర్లలో మాథ్యూ 2 వికెట్లు తీయగా.. అరీ ఫ్లెచర్‌, కరీష్మా, షమీలా కనెల్‌లు తలా ఒక వికెట్‌ తీశారు.

పాక్‌ చివరి మూడు ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన దశలో విండీస్‌ కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ అ‍ద్బుతంగా బౌలింగ్‌ చేసింది. ఆ ఓవర్‌లో ఒక వికెట్‌తో పాటు ఐదు పరుగులు మాత్రమే ఇచ్చుకుంది. ఆ తర్వాతి ఓవర్‌ చినెల్లే కూడా సూపర్‌గా వేసింది. తొలి రెండు బంతులు వైడ్‌ వేసినప్పటికి ఆ తర్వాత ఐదు పరుగులు ఇవ్వడంతో చివరి ఓవర్‌లో 18 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో పాకిస్తాన్‌ బ్యాటర్లు వరుసగా మూడు ఫోర్లు కొట్టడంతో సమీకరణం 2 బంతుల్లో ఐదు పరుగులుగా మారింది. అయితే ఐదో బంతికి అలియా రియాజ్‌ ఔట్‌ కావడంతో మ్యాచ్‌ విండీస్‌ వైపు తిరిగింది. చివరి బంతికి నాలుగు పరుగులు కావాల్సి ఉండగా ఒక్క పరుగు మాత్రమే రావడంతో విండీస్‌ మూడు పరుగుల తేడాతో సంచలన విజయం అందుకుంది.

చదవండి: 'గెలిచాం.. కానీ చాలా పాఠాలు నేర్చుకున్నాం'

Videos

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)