Breaking News

మనసున్న శ్రీ చరణి!

Published on Sun, 11/09/2025 - 11:23

సాక్షి ప్రతినిధి, కడప: భారతదేశానికి ప్రపంచకప్‌ గెలిపించడమే కాదు.. దేశ ప్రజల మనస్సూ గెలుచుకుంది. మైదానంలో చిరుతలా కదలడమే కాదు .. చిరు వయస్సులోనే గొప్ప పరిణతి చూపిస్తోంది. ఆమె ఎవరో కాదు భారతజట్టు మహిళా క్రికెటర్‌..మనసున్న మన చరణి. తనకు కేటాయించిన ప్రోత్సాహక బహుమతిలో రూ.10 లక్షలు అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారుల  కోసం కేటాయించాలని కోరి ప్రజల మన్ననలు చూరగొంది.

జిల్లాలో ఇప్పుడు ఎక్కడా చూసినా శ్రీచరణి పేరు మార్మోగుతోంది. తన ప్రతిభతో జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచడంపై నలుమూలల నుంచి ప్రశంసలు  పొందుతోంది. అయినప్పటికీ పొగడ్తలకు ఎక్కడా పొంగిపోలేదు. అంతర్జాతీయ స్థాయికి చేరినప్పటికీ నిన్నమొన్నటి వరకూ ఆరీ్టపీపీలో కలియతిరుగుతూ, కడప క్రికెట్‌ స్టేడియంలో తరీ్ఫదు పొందుతున్న శ్రీచరణిలాగే ఉండిపోయింది. జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సభ్యులు, కోచ్‌లతో అదే గురుభక్తితో మెలిగింది. కీర్తి కిరీటం పొందినప్పటికీ నిన్నమొన్నటి శ్రీచరణిలాగే కలుపుగోలుగా ఉండిపోవడం అదో గొప్ప లక్షణంగా పరిశీలకులు వివరిస్తున్నారు.  

అకాడమీ క్రీడాకారుల కోసం..
కడప జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ నేతృత్వంలో శుక్రవారం భారత మహిళ క్రికెటర్‌ శ్రీచరణిని ఘనంగా సత్కరించిన విషయం విదితమే. ఈకార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కడప, కమలాపురం ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, ఇన్‌చార్జ్‌ మేయర్‌ ముంతాజ్‌బేగం పాల్గొన్నారు. జిల్లా కీర్తి ప్రతిష్టలు పెంచిన శ్రీచరణిని ప్రోత్సహిస్తూ టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి రూ.5లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వెంటనే కమలాపురం ఎమ్మెల్యే కూడా రూ.5లక్షలు ప్రకటించారు. అంతలో శ్రీచరణి జోక్యం చేసుకుని తన ముందు కూర్చుని ఉన్న క్రికెట్‌ అకాడమీలో ట్రైనింగ్‌ పొందుతున్న భవిష్యత్‌ క్రీడాకారులు, అండర్‌–14 క్రికెట్‌ టీమ్‌ సభ్యులను చూపిస్తూ వారి ప్రోత్సాహం కోసం రూ.10లక్షలు కేటాయించాలని సూచించడం ఆమె గొప్పమనస్సుకు ప్రత్యక్ష నిదర్శనం. 

నిన్నామొన్నటి వరకూ ఖర్చుల డబ్బులు కోసం అమె ఎంతో కష్టపడింది. మేనమామ కిశోర్‌కుమార్‌రెడ్డి సహకారంతో నెట్టుకొచ్చింది. తాజాగా తనకు దక్కిన గౌరవంలో తనతోటి ట్రైనింగ్‌ పొందినా, పొందుతున్న క్రీడాకారు ల కోసం రూ.10లక్షలు ఇవ్వాలని నిర్ణయించడంపై ప్ర శంసలు దక్కుతున్నాయి. చిన్నవయస్సులో అత్యున్న త గౌరవం దక్కించుకున్న చరణికి అంతే పెద్ద మన స్సు ఉందని ఈ ఘటనతో రుజువు కావడం విశేషం.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)