Breaking News

Paris olympics: ఖలీఫ్‌ పసిడి పంచ్‌

Published on Sun, 08/11/2024 - 04:24

పారిస్‌: అల్జీరియాకు చెందిన వివాదాస్పద మహిళా బాక్సర్‌ ఇమాన్‌ ఖలీఫ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. 66 కేజీల కేటగిరీలో జరిగిన ఫైనల్లో యాంగ్‌ ల్యూ (చైనా)ను ఓడించి ఖలీఫ్‌ తన కెరీర్‌లో తొలి ఒలింపిక్‌ పతకాన్ని గెలుచుకుంది. పోటీలు ఆరంభమైనప్పటి నుంచి ఖలీఫ్‌పై వివాదం చెలరేగింది. పేరుకు ఆమె మహిళే అయినా శరీరంలో పురుష లక్షణాలు ఉన్నాయని... గతంలో ఇదే విషయంలో ఆమె నిషేధానికి గురైందని అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. 

మగాడి తరహాలో ఉన్న బాక్సర్‌ను మహిళల విభాగంలో అనుమతించారంటూ నిర్వాహకులను అంతా తిట్టిపోశారు. అయితే ఐఓసీ మాత్రం ఈ విమర్శలను లెక్క చేయకపోగా... ఖలీఫ్‌ కూడా ఆ ప్రభావం తనపై పడకుండా వరుసగా గెలుస్తూ పోయింది. ఇప్పుడు స్వర్ణంతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. ‘ఎనిమిదేళ్లుగా ఈ పతకం కోసం కలగన్నా. నేనిప్పుడు ఒలింపిక్‌ చాంపియన్‌ను. ఎన్నో సూటిపోటి మాటలు ఎదుర్కొన్నాను. అందుకే ఈ గెలుపు నాకు రెట్టింపు ఆనందాన్నిస్తోంది. 

నాలాంటి పరిస్థితి ఇంకెవరికీ రావద్దు. నేను పుట్టుకతో మహిళను. ఇతర మహిళల్లాగే నేను కూడా. అలాగే జీవిస్తాను కూడా. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అన్ని రకాలుగా అర్హత ఉన్నదానిని కాబట్టే క్వాలిఫై అయ్యాను’ అని కన్నీళ్లపర్యంతమవుతూ ఖలీఫ్‌ వ్యాఖ్యానించింది. అల్జీరియా దేశ చరిత్రలో ఇది ఏడో స్వర్ణపతకం.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)