Breaking News

విజేతకు ఇచ్చేది నమూనా ట్రోఫీనే!

Published on Sun, 07/19/2026 - 01:16

ప్రతిష్టాత్మక ‘ఫిఫా’ వరల్డ్‌ కప్‌ ట్రోఫీ రూపకల్పన ఆసక్తికరంగా జరిగింది. మైదానంలో ప్లేయర్ల పోరాటం... స్టాండ్స్‌లో అభిమానుల ఆనందం... విజయం సాధించిన అపురూప క్షణం... ఈ మూడు భావోద్వేగాలకు ప్రస్తుతం విజేతకు అందిస్తున్న ట్రోఫీ ప్రతిరూపం. ఇటలీకి చెందిన ప్రఖ్యాత శిల్పి సిల్వియో గజానిగా దీన్ని రూపొందించారు. 1930లో జరిగిన తొలి వరల్డ్‌ కప్‌ సమయంలో రూపొందించిన ట్రోఫీ గ్రీకు దేవత ‘నైక్‌’ను పోలి ఉండేది. 1970లో బ్రెజిల్‌ మూడోసారి వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన అనంతరం అసలు ట్రోఫీని శాశ్వతంగా సొంతం చేసుకుంది. దీంతో కొత్త డిజైన్‌ రూపకల్పన అనివార్యమైంది. 

పలు ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వేల డిజైన్‌లు... వందల మోడల్స్‌... పదుల సంఖ్యలో నమూనాలు తీర్చిదిద్దిన తర్వాత జ్యూరీ చివరకు ప్రస్తుతం ఉన్న ట్రోఫీకి పచ్చజెండా ఊపింది. ఫైనల్లో విజయం సాధించిన జట్టు కెప్టెన్‌కు అందించే అసలు ట్రోఫీ ఎత్తు 36 సెంటీమీటర్లు, ఇది 18 క్యారెట్‌ల బంగారంతో తయారు చేస్తారు. అయితే ఈ ట్రోఫీని విజేతకు శాశ్వతంగా అందించరు. సంబరాల అనంతరం ‘ఫిఫా’ దాన్ని తిరిగి తీసుకుంటుంది. దాని స్థానంలో బంగారు పూత పూసిన నమూనా ట్రోఫీని మాత్రమే విజేత జట్టుకు ఇస్తారు. 

తదుపరి వరల్డ్‌కప్‌ వరకు అసలైన ట్రోఫీ స్విట్జర్లాండ్‌లోని ‘ఫిఫా’ ప్రధాన కార్యాలయంలో ఉంటుంది. అయితే గతంలో మూడుసార్లు వరల్డ్‌కప్‌ నెగ్గిన జట్టు ఈ ట్రోఫీని శాశ్వతంగా తమ వద్ద ఉంచుకునేది... ప్రస్తుతం దీనికి ‘ఫిఫా’ అనుమతించడం లేదు. 1974 వరల్డ్‌కప్‌లో మొదటిసారి వాడిన ప్రస్తుత డిజైన్‌ను ఇప్పటి వరకు 14 సార్లు ఉపయోగించారు. 2038 వరకు ఇదే ట్రోఫీని కొనసాగించాలని ‘ఫిఫా’ నిర్ణయించింది.  

కప్‌ను కరిగించేశారు! 
వరుసగా మూడోసారి విశ్వవిజేతగా నిలిచి బ్రెజిల్‌ 1970లో సొంతం చేసుకున్న ‘జూల్స్‌ రిమేట్‌ ట్రోఫీ’ ఇప్పుడు లేదు. ఈ కప్‌ రెండుసార్లు చోరికి గురైంది. 1966లో తొలిసారి ప్రేక్షకుల కోసం లండన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ సమయంలో దీనిని ఎవరో చోరి చేశారు. అయితే ‘పికిల్స్‌’ పేరు గల జాగిలం సౌత్‌ లండన్‌లో దీనిని గుర్తించడంతో ప్రపంచకప్‌ దొరికింది. ఆ తర్వాత 1983లో బ్రెజిల్‌ ఫుట్‌బాల్‌ సమాఖ్య ప్రధాన కార్యాలయం నుంచి ఎవరో ఈ ప్రపంచకప్‌ను ఎత్తుకెళ్లారు. చోరీ చేసిన వ్యక్తులు బంగారు ప్రపంచకప్‌ను కరిగించేశారని.. అందుకే ఎంత వెతికినా ప్రపంచకప్‌ జాడ దొరకలేదని చెబుతుంటారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)