Breaking News

ఇంగ్లండ్ తుది జట్టు ప్ర‌క‌ట‌న‌.. మూడేళ్ల త‌ర్వాత స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ

Published on Tue, 12/02/2025 - 19:45

యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ తుది జట్టుని ప్రకటించింది. తొలి టెస్ట్‌లో ఘోర పరాజయాన్ని చవిచూసిన ఇంగ్లండ్ జట్టు.. ఈ డే-నైట్ పింక్ బాల్ టెస్ట్ కోసం ఒకే ఒక్క మార్పు చేసింది. గాయపడిన పేసర్ మార్క్ వుడ్ స్థానంలో ఆల్‌రౌండర్‌ విల్ జాక్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి వచ్చాడు.

జాక్స్ దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఇంగ్లడ్ తరపున టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్దమయ్యాడు. జాక్స్ తన కెరీర్‌లో ఇప్పటివరకు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఆడాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఇంగ్లండ్ జట్టుకు అతడు రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నాడు. 

అతడిని జ‌ట్టులోకి తీసుకురావ‌డం వెనుక ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండ‌న్ మెక‌ల్ల‌మ్ మాస్ట‌ర్ మైండ్ ఉంది. జాక్స్‌ను కేవలం స్పిన్ ఎంపికగా కాకుండా, అతని బ్యాటింగ్‌ సామర్థ్యం కారణంగానే తుది జ‌ట్టులో చోటు ఇచ్చారు. బ్యాటింగ్ డెప్త్‌ను పెంచుకోవ‌డం కోస‌మే రెగ్యూల‌ర్ స్పిన్న‌ర్ బ‌షీర్ కాకుండా జాక్స్ వైపు టీమ్ మెనెజ్‌మెంట్ మొగ్గు చూపింది. గురువారం(డిసెంబ‌ర్ 4) నుంచి బ్రిస్బేన్ వేదిక‌గా ఈ యాషెస్ రెండో టెస్టు ప్రారంభం కానుంది.

ఇంగ్లండ్ తుది జ‌ట్టు ఇదే
జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓల్లీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీప‌ర్‌), విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్
చదవండి: క్రికెట్‌ ప్రపంచంలో తీవ్ర విషాదం.. రాబిన్‌ స్మిత్‌ హఠాన్మరణం
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)