Breaking News

వరుస వైఫల్యాలు.. స్టార్‌ ఆటగాడిపై వేటు వేసిన ఆస్ట్రేలియా

Published on Fri, 06/20/2025 - 10:38

మూడు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం వెస్టిండీస్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా.. జూన్‌ 25 నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌కు ముందు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్‌ మిడిలార్డర్‌ ఆటగాడు మార్నస్‌ లబూషేన్‌పై వేటు వేసింది. లబూషేన్‌ గత కొంతకాలంగా పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఈ కారణంగా అతనికి తొలి టెస్ట్‌ తుది జట్టులో అవకాశం ఇవ్వలేదు. ఈ విషయాన్ని సెలెక్షన్‌ కమిటీ చైర్మన్‌ జార్జ్‌ బెయిలీ ఓ ప్రకటనలో తెలిపారు. 

లబూషేన్‌ తమ జట్టులో కీలక​ సభ్యుడని చెబుతూనే అతని రెండేళ్ల గణాంకాలను ప్రస్తావించాడు. 2023లో 34.91 సగటున పరుగులు చేసిన లబూషేన్‌.. గతేడాది (2024) తన సగటును (30.93) మరింత దిగజార్చుకున్నాడని అన్నాడు. ఈ ఏడాది సైతం లబూషేన్‌ ఫామ్‌ను దొరకబుచ్చుకోలేకపోయాడని తెలిపాడు (4 టెస్ట్‌ల్లో 16 సగటు). 

చివరి రెండు ఇన్నింగ్స్‌ల్లో (డబ్ల్యూటీసీ ఫైనల్‌) ఓపెనర్‌గా అవకాశమిచ్చినా దారుణంగా విఫలమయ్యాడని (17,22) అన్నాడు. తొలి టెస్ట్‌ జట్టు నుంచి తప్పించినా లబూషేన్‌ టాలెంట్‌ను గౌరవిస్తూ మున్ముందు పరిశీలిస్తామని తెలిపాడు.

మరోవైపు మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌కు కూడా తొలి టెస్ట్‌ తుది జట్టులో అవకాశం ఇవ్వలేమని బెయిలీ చెప్పాడు. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌ సందర్భంగా స్మిత్‌ గాయపడ్డ (చేతి వేలి) విషయాన్ని ధృవీకరించాడు. స్మిత్‌ సర్జరీని తప్పించుకున్నప్పటికీ.. ఎనిమిది వారాలు చేతికి కట్టుతో ఉండాలని డాక్టర్లు చెప్పినట్లు తెలిపాడు. 

బ్యాటింగ్‌కు ఇబ్బంది లేకపోతే రెండో టెస్ట్‌లో (జూన్‌ 3) స్మిత్‌ను ఆడించే అవకాశాలున్నాయని అన్నాడు. లబూషేన్‌, స్మిత్‌ స్థానాల్లో సామ్‌ కొన్‌స్టాస్‌, జోస్‌ ఇంగ్లిస్‌లను తుది జట్టులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. 

కొన్‌స్టాస్‌ గతేడాది భారత్‌తో జరిగిన బాక్సింగ్‌ డే టెస్ట్‌లో ఆకట్టుకున్నాడు. లబూషేన్‌ స్థానంలో తొలి టెస్ట్‌లో అతను ఉస్మాన్‌ ఖ్వాజాతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడు. స్టీవ్‌ స్మిత్‌ స్థానాన్ని మిడిలార్డర్‌లో ఇంగ్లిస్‌ భర్తీ చేస్తాడు. ఇంగ్లిస్‌ ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో ఆడిన తన అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీతో ఇరగదీశాడు. 

ప్లేయింగ్‌ ఎలెవెన్‌లో మిగతా స్థానాలపై ఆసీస్‌ ఇంకా ప్రకటన చేయలేదు. జూన్‌ 25 నుంచి బార్బడోస్‌ వేదికగా తొలి టెస్ట్‌ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

వెస్టిండీస్‌తో టెస్ట్‌ సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కాన్‌స్టాస్, మాట్ కుహ్నెమాన్, మార్నస్ లబూషేన్‌, నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్.  

ఆసీస్‌తో తొలి టెస్ట్‌కు విండీస్‌ జట్టు: కెవ్లాన్‌ ఆండర్సన్‌, బ్రాండన్‌ కింగ్‌, క్రెయిగ్‌ బ్రాత్‌వైట్‌, మిఖైల్‌ లూయిస్‌, జాన్‌ క్యాంప్‌బెల్‌, కీసీ కార్టీ, జస్టిన్‌ గ్రీవ్స్‌, రోస్టన్‌ ఛేజ్‌, జోహన్‌ లేన్‌, షాయ్‌ హోప్‌, టెవిన్‌ ఇమ్లాచ్‌, జోమెల్‌ వార్రికన్‌, అల్జరీ జోసఫ్‌, షమార్‌ జోసఫ్‌, ఆండర్సన్‌ ఫిలిప్‌, జేడన్‌ సీల్స్‌

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)