Breaking News

IND VS SA T20 Series: శివమ్‌ దూబే, రియాన్‌ పరాగ్‌కు ఏమైంది..?

Published on Sat, 10/26/2024 - 07:51

సౌతాఫ్రికాతో నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత జట్టును నిన్న (అక్టోబర్‌ 25) ఎంపిక చేశారు. అందరి అంచనాలకు తగ్గట్టుగానే ఈ జట్టు ఎంపిక జరిగినప్పటికీ.. ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన సిరీస్‌లలో జట్టుతో పాటు ఉన్న శివమ్‌ దూబే, రియాన్‌ పరాగ్‌, మయాంక్‌ యాదవ్‌ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపిక కాలేదు. వీరిని ఎంపిక చేయకపోవడంపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది.

మయాంక్‌ యాదవ్‌, శివమ్‌ దూబే గాయాల బారిన పడటంతో వారిని పరిగణలోకి తీసుకోలేదని చెప్పిన బీసీసీఐ.. రియాన్‌ పరాగ్‌ భుజం సమస్య కారణంగా సెలెక్షన్‌కు అందుబాటులో లేడని వివరణ ఇచ్చింది. ప్రస్తుతం రియాన్‌ బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌లో రిపోర్ట్‌ చేసినట్లు తెలిపింది. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేయని అంశాన్ని పక్కన పెడితే.. జట్టులో రెండు అనూహ్య ఎంపికలు జరిగాయి.

బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ రమన్‌దీప్‌ సింగ్‌, పేస్‌ బౌలర్‌ విజయ్‌కుమార్‌ వైశాఖ్‌ ఊహించని విధంగా జట్టులోకి వచ్చారు. వీరిద్దరికి చోటు దక్కుతుందని ఎవరు ఊహించలేదు. ఇవి మినహా మిగతా జట్టు ఎంపిక అంతా ఊహించిన విధంగానే జరిగింది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ కొనసాగనుండగా.. వికెట్‌కీపర్లుగా సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మ ఎంపికయ్యారు. కాగా, దక్షిణాఫ్రికా సిరీస్‌తో పాటు బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ కోసం కూడా భారత జట్టును నిన్ననే ప్రకటించారు.

దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: 
సూర్యకుమార్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్, రమణ్‌దీప్‌ సింగ్, వరుణ్‌ చక్రవర్తి, రవి బిష్ణోయ్, అర్ష్ దీప్, విజయ్‌ కుమార్‌ వైశాఖ్‌, అవేశ్‌ ఖాన్, యశ్‌ దయాళ్‌

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌..

తొలి మ్యాచ్‌- నవంబర్‌ 8 (డర్బన్‌)
రెండో మ్యాచ్‌- నవంబర్‌10 (గ్వెకెర్బా)
మూడో మ్యాచ్‌- నవంబర్‌ 13 (సెంచూరియన్‌)
నాలుగో మ్యాచ్‌- నవంబర్‌ 15 (జోహనెస్‌బర్గ్‌)

చదవండి: ఆ్రస్టేలియా పర్యటనకు నితీశ్‌ కుమార్‌ రెడ్డి

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)