Breaking News

భారత్‌ను ఓడించిన జట్టు వరల్డ్‌కప్‌ గెలుస్తుంది.. మా జట్టుకు దిష్టి పెట్టకు!

Published on Tue, 09/26/2023 - 09:12

క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్‌కు మరో 9 రోజుల్లో తేరలేవనుంది. ఆక్టోబర్‌ 5న అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న ఇంగ్లండ్‌- న్యూజిలాండ్ మ్యాచ్‌తో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఇక ఈ మెగా ఈవెంట్‌కు ముందు టీమిండియాను ఉద్దేశించి ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

వరల్డ్‌కప్‌లో భారత్‌ను ఓడించే జట్టుకు టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉందని వాన్‌ అభిప్రాయపడ్డాడు. కాగా వరల్డ్‌కప్‌కు ముందు భారత జట్టు అద్భుతమైన ఫామ్‌లో ఉంది. అందరూ ఆటగాళ్లు తిరిగి ఫామ్‌లోకి వచ్చేసారు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరగుతున్న వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే టీమిండియా సొంతం చేసుకుంది.

ఇండోర్‌ వేదికగా కంగారులతో జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ఏకంగా 399 పరుగుల భారీ స్కోర్‌ను టీమిండియా సాధించింది. గిల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ సెంచరీలతో చెలరేగగా.. సూర్య, రాహుల్‌ మెరుపులు మెరిపించాడు. ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్‌ ప్రదర్శనపై వాన్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

"నాకు చాలా స్పష్టత వచ్చేసింది. ఏ జట్టు అయితే భారత్‌ను ఓడిస్తుందో వారే వరల్డ్‌కప్‌ను గెలుస్తారు. సొంత పిచ్‌లపై భారత బ్యాటింగ్ తీరు అద్భుతంగా ఉంది. అదే విధంగా టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ కూడా అత్యుత్తమంగా ఉంది. అంతేకాకుండా భారత్‌ దగ్గర చాలా బౌలింగ్‌ ఎంపికలు కూడా ఉన్నాయి. ఇక ఒత్తిడి మాత్రమే వారిని ఆపగలదు" ఎక్స్‌(ట్విటర్‌)లో వాన్‌ రాసుకొచ్చాడు. 

మా జట్టుకు దిష్టిపెట్టకు ..
ఇక వాన్‌ భారత జట్టుపై చేసిన వ్యాఖ్యలపై టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ ఫన్నీగా స్పందించాడు. ‘మా జట్టుకు దిష్టిపెట్టకు’ అనే అర్థం వచ్చేలా ఓ ఫొటోను పోస్ట్ చేశాడు.
చదవండి: World Cup 2023: ‘వీసా’ వచ్చేసింది...  రేపు హైదరాబాద్‌కు పాకిస్తాన్‌ జట్టు   

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)