Breaking News

భారత జట్టు తరపున అరంగేట్రం.. ఎవరీ సయాలీ గణేష్‌?

Published on Fri, 01/10/2025 - 14:00

రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు తొలి వ‌న్డేలో ఐర్లాండ్‌తో త‌ల‌ప‌డుతోంది.  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. హ‌ర్మాన్ ప్రీత్ కౌర్ గైర్హ‌జరీలో స్మ‌తి స్మృతి మంధాన భార‌త జ‌ట్టు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇక ఈ మ్యాచ్‌తో ముంబైకి చెందిన ఆల్‌రౌండర్ సయాలీ సత్‌ఘరే గణేష్ భార‌త్‌ త‌రపున అంత‌ర్జాతీయ అరంగేట్రం చేసింది. కెప్టెన్ స్మ‌తి స్మృతి మంధాన చేతుల మీద‌గా ఆమె ఇండియా క్యాప్‌ను అందుకుంది. ఈ క్ర‌మంలో నెటిజ‌న్లు ఎవ‌రీ సయాలీ అని వెతుకుతున్నారు.

ఎవ‌రీ స‌యోలీ?
24 ఏళ్ల సయోలీ స‌త్‌ఘ‌రే దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వ‌హిస్తోంది. 2015లో అరంగేట్రం చేసిన ఆమె.. అప్ప‌టినుంచి నిల‌కడ‌గా రాణిస్తోంది. అయితే  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024తో ఆమె కెరీర్ మ‌లుపు తిరిగింది. గ‌తేడాది డబ్ల్యూపీఎల్‌లో గుజ‌రాత్ జెయింట్స్‌కు ఆమె ప్రాతినిథ్యం వ‌హించింది. ఆ సీజ‌న్‌లో తొలుత‌ ఆమె చాలా మ్యాచ్‌ల‌కు బెంచ్‌కే ప‌రిమిత‌మైంది.

కానీ ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం స‌యోలీకి సువ‌ర్ణ అవ‌కాశం ల‌భించింది.  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డి హేమలతకు కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఆమె బ‌రిలోకి దిగింది. ఆ మ్యాచ్‌లో ఆమె ప‌ర్వాలేద‌న్పించింది. దీంతో డబ్ల్యూపీఎల్-2025 సీజ‌న్‌కు ముందు గుజ‌రాత్ ఆమెను రూ.10 లక్ష‌ల‌కు రిటైన్ చేసుకుంది.  సయోలీ స‌త్‌ఘ‌రే అద్బుత‌మైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే ఆమె భార‌త జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చింది.

దేశీవాళీ క్రికెట్‌లో అదుర్స్‌..
లిస్ట్‌-ఎ క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 51 మ్యాచ్‌లు ఆడిన స‌యోలీ..  20.81 సగటుతో 666 పరుగులు, 56 వికెట్లు పడగొట్టింది. 2023–24 సీనియర్ మహిళల వన్డే ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్‌పై ఆమె ఆజేయ సెంచ‌రీతో మెరిసింది. బౌలింగ్‌లో 7/5 స్పెల్ అత్యుత్త‌మ గ‌ణాంకాలుగా ఉన్నాయి.

తుది జట్లు
భారత మహిళల జట్టు: స్మృతి మంధాన(కెప్టెన్‌), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, తేజల్ హసబ్నిస్, రిచా ఘోష్(వికెట్ కీప‌ర్‌), దీప్తి శర్మ, సయాలీ సత్‌ఘరే, సైమా ఠాకోర్, ప్రియా మిశ్రా, టిటాస్ సాధు

ఐర్లాండ్ మహిళల జ‌ట్టు: సారా ఫోర్బ్స్, గాబీ లూయిస్(కెప్టెన్‌), ఉనా రేమండ్-హోయ్, ఓర్లా ప్రెండర్‌గాస్ట్, లారా డెలానీ, లేహ్ పాల్, కౌల్టర్ రీల్లీ(వికెట్ కీప‌ర్‌), అర్లీన్ కెల్లీ, జార్జినా డెంప్సే, ఫ్రెయా సార్జెంట్, ఐమీ మాగైర్

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)