Breaking News

శ్రీలంక త‌ర‌పున అరంగేట్రం.. ఎవ‌రీ మ‌హ్మ‌ద్ సిరాజ్‌?

Published on Fri, 08/02/2024 - 17:10

శ్రీలంక త‌ర‌పున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాల‌నుకున్న ఫాస్ట్ బౌల‌ర్ మహ్మద్ సిరాజ్‌ క‌ల ఎట్ట‌కేల‌కు నేర‌వేరింది. కొలంబో వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి వ‌న్డేలో మహ్మద్ సిరాజ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. శ్రీలంక తుది జ‌ట్టులో సిరాజ్‌కు చోటు ద‌క్క‌డంతో త‌న సుదీర్ఘ నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డింది.

కాగా భార‌త్‌తో వ‌న్డేల‌కు తొలుత ప్ర‌క‌టించిన లంక ప్ర‌ధాన జ‌ట్టులో సిరాజ్‌కు ఛాన్స్ ల‌భించ‌లేదు. అయితే తొలి వ‌న్డేకు ముందు గాయప‌డిన యువ పేస‌ర్ మ‌తీషా ప‌తిరాన స్ధానంలో షిరాజ్ లంక జ‌ట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేప‌థ్యంలో  షిరాజ్ గ‌రుంచి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం.

ఎవ‌రీ మ‌హ్మ‌ద్ సిరాజ్‌?
29 ఏళ్ల షిరాజ్ దేశ‌వాళీ క్రికెట్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. కోల్ట్స్ క్రికెట్ క్లబ్(కొలంబో) త‌ర‌పున ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్‌.. ప్ర‌స్తుతం కాండీ క్రికెట్ క్ల‌బ్‌కు ప్రాత‌నిథ్యం వ‌హిస్తున్నాడు. అదేవిధంగా లిస్ట్‌-ఎ క్రికెట్‌లో మాత్రం కురునెగల జ‌ట్టు త‌ర‌పున షిరాజ్ ఆడుతున్నాడు. 

ఇప్ప‌టివ‌ర‌కు 47 లిస్ట్‌-ఎ మ్యాచ్‌లు ఆడిన సిరాజ్‌.. 7.52 సగటుతో 80 వికెట్లు పడగొట్టాడు.  ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో  సిరాజ్‌ 49 మ్యాచ్‌లలో 125 వికెట్లు సాధించాడు. అత‌డి ఎకాన‌మీ రేటు కూడా 3.65గా ఉంది. దేశ‌వాళీ క్రికెట్‌లో నిల‌క‌డ‌గా రాణిస్తుండ‌డంతో సెల‌క్ట‌ర్ల దృష్టిలో షిరాజ్ పడ్డాడు. ఈ క్రమంలోనే భారత్‌తో వన్డే సిరీస్‌కు అతడికి లంక సెలక్టర్లు పిలుపునిచ్చారు. షిరాజ్‌కు బంతితో పాటు బ్యాట్‌తో కూడా రాణించే సత్తా ఉంది.

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)