Breaking News

ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్‌, ద్రవిడ్‌పై అశ్విన్‌ విసుర్లు!

Published on Fri, 06/23/2023 - 14:00

‘ముందుగా ఆస్ట్రేలియాకు కంగ్రాట్యులేషన్స్‌!! డబ్ల్యూటీసీ ఫైనల్‌ అద్భుతంగా సాగింది. విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు. మార్నస్‌ లబుషేన్‌ వంటి ఆటగాళ్లు కౌంటీల్లో ఆడటం వాళ్లకు కాస్త ప్రయోజనకరంగా మారిన మాట వాస్తవమే.

నిజానికి టీమిండియాలాగే ఆసీస్‌ కూడా గత డబ్ల్యూటీసీ సైకిల్‌లో నిలకడైన ప్రదర్శన కనబరిచింది. కానీ ఫైనల్‌కు చేరలేకపోయింది. కానీ ఈసారి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంది. వారికి గెలిచే అర్హత వందకు వందశాతం ఉంది’’ అని టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు.

అశూకు మొండిచేయి
ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌-2023 ఫైనల్లో రోహిత్‌ సేనను ఓడించిన ఆసీస్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ తన యూట్యూబ్‌ చానెల్‌లో ఓ వీడియో విడుదల చేశాడు. కాగా డబ్ల్యూటీసీ 2021-23 సైకిల్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన టీమిండియా బౌలర్‌ అశూకు ఫైనల్‌ ఆడే జట్టులో చోటు దక్కలేదు.

అనుభవజ్ఞుడు, విదేశాల్లో మంచి రికార్డు ఉన్న అశ్విన్‌కు ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో మొండిచేయి చూపడం చర్చనీయాంశమైంది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 209 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను ఉద్దేశించి సోషల్‌ మీడియా వేదికగా అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు.

ఈ విషయంపై తాజాగా స్పందించిన అశ్విన్‌.. ‘‘గత పదేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదు. కాబట్టి అభిమానులు ఆవేశపడటం సహజమే. వారి బాధను నేను సహానుభూతి చెందగలను. 

నేనూ ధోని కెప్టెన్సీలో ఆడినవాడినే
అయితే, జట్టు నుంచి ఈ ఆటగాడిని తప్పిస్తే బాగుండు.. అతడికి అవకాశం ఇవ్వాల్సింది అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేయడం సరికాదు. ఎందుకంటే రాత్రికి రాత్రే ఆటగాళ్ల నైపుణ్యాలు, శక్తిసామర్థ్యాల్లో మార్పులు రావు. 

మనలో చాలా మంది ధోని నాయకత్వ పటిమ గురించి చర్చించుకుంటాం. అతడి సీక్రెట్‌ ఏంటి? ఏ విషయాన్నైనా అతడు సరళతరం చేస్తాడు. నేను కూడా ధోని సారథ్యంలో ఆడిన వాడినే.

అతడు తన జట్టులో తొలుత 15 మందిని ఎంపిక చేసుకుంటాడు. ఆ పదిహేను మంది నుంచే తుదిజట్టును ఎంపిక చేసుకుంటాడు. వారినే ఏడాది మొత్తం జట్టులో ఉండేలా చూసుకుంటాడు. 

ఆటగాడికి సెక్యూరిటీ ఉండాలి
నిజానికి ఓ ఆటగాడు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలంటే.. జట్టులో తన స్థానం పదిలమే అన్న నమ్మకం అతడికి కలగాలి’’ అని అన్నాడు. ధోని కెప్టెన్సీని ప్రశంసిస్తూ.. పరోక్షంగా రోహిత్‌ శర్మ, రాహుల్‌ ద్రవిడ్‌కు చురకలు అంటించాడు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్లో అశూకు బదులు మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు చోటిచ్చారు. అతడు ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

చదవండి: 'మెక్‌కల్లమ్‌ కంటే ముందు నన్ను సంప్రదించారు.. తిరస్కరించా'
టీమిండియా ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. మరోసారి భారత జట్టులోకి ధోని!

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)