Breaking News

SRH vs RR: ఎంత టాలెంట్‌ ఉంటే ఏం లాభం?: టీమిండియా దిగ్గజం ఫైర్‌

Published on Sat, 05/25/2024 - 10:46

రాజస్తాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ రియాన్‌ పరాగ్‌ ఆట తీరుపై టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ మండిపడ్డాడు. ప్రతిభ ఉంటే సరిపోదని.. దానిని ఎలా వినియోగించుకోవాలో కూడా తెలిసి ఉండాలంటూ చురకలు అంటించాడు.

ఐపీఎల్‌-2024లో ఆది నుంచి వరుస విజయాలు సాధించిన రాజస్తాన్‌ రాయల్స్‌.. ఆ తర్వాత వరుస ఓటములతో విమర్శలు మూటగట్టుకుంది. ప్లే ఆఫ్స్‌ చేరినప్పటికీ సంజూ శాంసన్‌ సేన స్థాయికి తగ్గట్లు రాణించడం లేదని విశ్లేషకులు పెదవి విరిచారు.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విశ్వరూపం
అలాంటి సమయంలో కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో అద్భుత ఆట తీరుతో రాజస్తాన్‌ తిరిగి సత్తా చాటింది. అహ్మదాబాద్‌లో బుధవారం నాటి మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును చిత్తు చేసి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించింది.

విలువైన ఇన్నింగ్స్‌ ఆడిన రియాన్‌
ఈ విజయంలో రియాన్‌ పరాగ్‌ కీలక పాత్ర పోషించాడు. 26 బంతుల్లో 36 విలువైన పరుగులు జోడించి జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో సహకారం అందించాడు. అయితే, మరో కీలకమైన మ్యాచ్‌లో మాత్రం ఒత్తిడిలో అతడు చిత్తయ్యాడు.

మరో కీలక మ్యాచ్‌లో మాత్రం విఫలం
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో శుక్రవారం నాటి క్వాలిఫయర్‌-2లో రియాన్‌ పరాగ్‌ పూర్తిగా విఫలమయ్యాడు. లక్ష్య ఛేదనలో రాజస్తాన్‌ తడబడుతున్న వేళ నాలుగో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన 22 ఏళ్ల ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌.. 10 బంతులు ఎదుర్కొని కేవలం 6 పరుగులే చేశాడు.

రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌ వేసిన రైజర్స్‌ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ షాబాజ్ అహ్మద్‌ బౌలింగ్‌లో మొదటి బంతిని ఎదుర్కొనే క్రమంలో.. నిర్లక్ష్యంగా వికెట్‌ పారేసుకున్నాడు. అనవసరపు షాట్‌కు యత్నించి బంతిని గాల్లోకి లేపగా.. అభిషేక్‌ శర్మ క్యాచ్‌ పట్టాడు.

 

దీంతో రియాన్‌ పరాగ్‌ తడ‘బ్యాటు’ అంతటితో ముగిసిపోయింది. అతడు అవుటైన తీరుకు రాజస్తాన్‌ కోచ్‌ సంగక్కర షాక్‌లో ఉండిపోగా.. కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ తీవ్ర స్థాయిలో విమర్శించాడు.

ఎంత టాలెంట్‌ ఉంటే ఏం లాభం?
‘‘ఎలా ఉపయోగించుకోవాలో తెలియనపుడు నీకు ఎంత ప్రతిభ ఉంటే ఏం లాభం? అసలు ఇలాంటి షాట్‌ ఎలా ఆడతావు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. అపారమైన ప్రతిభ.. కానీ దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలియదు. 

ఇంకొన్ని బంతుల వరకు పరుగులు రానంత మాత్రాన ఏం మునిగిపోతుంది? ఆ తర్వాత మళ్లీ పుంజుకోవచ్చు కదా!’’ అంటూ గావస్కర్‌ లైవ్‌ కామెంట్రీలోనే రియాన్‌ పరాగ్‌పై ఫైర్‌ అయ్యాడు. కాగా ఈ ఏడాది ఐపీఎల్‌లో రియాన్‌ పరాగ్‌ 16 మ్యాచ్‌లలో కలిపి 573 పరుగులు సాధించాడు.

చదవండి: Kavya Maran Viral Reaction Video: దటీజ్‌ కావ్య.. సరైన నిర్ణయాలు!.. తండ్రిని హత్తుకుని చిన్నపిల్లలా!

Videos

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు.. వీడియో వైరల్..!

LIVE: YSRకు జగన్ నివాళులు

దిగొచ్చిన గోల్డ్ భారీగా తగ్గిన బంగారం.. వెండి

ఇరుముడి OTTలోకి ఎప్పుడు.?

లోకల్ ఎన్నికల్లో భారీ విజయం జగన్ దిశానిర్దేశం

Kapra Lake: గణేష్ విగ్రహాల నిమజ్జనంపై వివాదం..

తెనాలిలో వ్యాపారి కిడ్నాప్ కేసు విషాదాంతం

చంద్రబాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టు హెచ్చరిక

సభలో అందరిముందు జనసేన గాలి తీసిన బాబు..

Idupulapaya: YSR ఘాట్‌ వద్ద జగన్‌ నివాళులు

Photos

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)