Breaking News

కెప్టెన్‌తో గొడవ.. జోసెఫ్‌నకు బిగ్‌ షాకిచ్చిన విండీస్ క్రికెట్‌​

Published on Fri, 11/08/2024 - 08:10

వెస్టిండీస్ స్టార్ పేస‌ర్ అల్జారీ జోసెఫ్‌నకు ఆ దేశ క్రికెట్ బోర్డు బిగ్ షాకిచ్చింది. అత‌డిపై రెండు మ్యాచ్‌ల నిషేధం వెస్టిండీస్ క్రికెట్ విధించింది. దీంతో స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు టీ20ల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల‌కు జోష‌ఫ్ దూరం కానున్నాడు. బార్బోడ‌స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఆఖ‌రి వ‌న్డేలో జోసెఫ్‌ బోర్డు విధానాలు, క్రమశిక్షణ ఉల్లఘించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు విండీస్‌​ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

అసలేం జరిగిందంటే?
బుధవారం(నవంబ‌ర్ 6) ఇంగ్లండ్‌తో జ‌రిగిన ఆఖ‌రి వ‌న్డేలో జోసెఫ్‌​ తమ కెప్టెన్ షాయ్ హోప్‌తో వాగ్వాదానికి దిగాడు. జోషఫ్ వేసిన నాలుగో ఓవర్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోర్డాన్ కాక్స్‌కు ఇద్దర్ స్లిప్ ఫీల్డ‌ర్ల‌ను హోప్ సెట్ చేశాడు. కానీ ఈ ఫీల్డింగ్ సెటప్ జోసెఫ్‌నకు  నచ్చలేదు.

దీంతో హోప్‌తో జోసెఫ్‌ గొడవ పడ్డాడు. అతడితో వాగ్వాదం చేస్తేనే ఓవర్‌ను ​కొనసాగించాడు. ఆ ఓవర్‌లో కాక్స్‌ను ఔట్ చేసిన జోసెఫ్‌నకు  కనీసం సెలబ్రేషన్స్ కూడా చేసుకోలేదు. అయితే తన ఓవర్‌ను పూర్తి చేసిన అనంతరం తన ఓవర్‌ పూర్తి కాగానే మైదానం విడిచిపెట్టి డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత కోచ్‌ సామీతో సంప్రదింపులు జరిపిన తర్వాత జోసెఫ్‌ మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఈ క్రమంలోనే అతడిపై వెస్టిండీస్ క్రికెట్ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది.

సారీ చెప్పిన జోషఫ్‌
ఇక ఈ మ్యాచ్ అనంతరం తన తప్పును తెలుసుకున్న జోసెఫ్‌ కెప్టెన్ హోప్‌తో పాటు జట్టు మేనెజ్‌మెంట్‌కు క్షమాపణలు తెలిపాడు. ‘‘ఏదేమైనప్పటికీ ఆఖ‌రి వ‌న్డేలో నేను కొంచెం మితిమీరి ప్రవర్తించాను. ఇప్ప‌టికే కెప్టెన్ షాయ్ హోప్, నా సహచరులు ,మేనేజ్‌మెంట్‌కు నేను వ్యక్తిగతంగా సారీ చెప్పాను. వెస్టిండీస్ అభిమానులకు నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని ఓ ప్ర‌క‌ట‌న‌లో జోసెఫ్‌ పేర్కొన్నాడు. ఇక ఇంగ్లండ్‌-విండీస్ మ‌ధ్య ఐదు టీ20ల సిరీస్ నవంబ‌ర్ 9న జ‌ర‌గ‌నున్న తొలి మ్యాచ్‌తో ప్రారంభం కానుంది.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)